రోజాపై అనుచితం: ఆనంకు కోర్టు సమన్లు జారీ
వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా దాఖలు చేసిన పరువునష్టం కేసులో తెలుగుదేశం పార్టీ నేత ఆనం వివేకానందరెడ్డికి నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది.
హైదరాబాద్/నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా దాఖలు చేసిన పరువునష్టం కేసులో తెలుగుదేశం పార్టీ నేత ఆనం వివేకానందరెడ్డికి నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. మార్చి 8న కోర్టు ముందు హాజరుకావాలని న్యాయస్థానం బుధవారం ఆయన్ని ఆదేశించింది.
తన పరువుకు భంగం కలిగించేలా వివేకానందరెడ్డి వ్యాఖ్యలు చేశారంటూ రోజా గతంలో కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను మూడవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ బుధవారం విచారించారు.

రోజా తరఫున వైయస్సార్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. 2016, ఫిబ్రవరి 29న వివేకానందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రోజాను కించపరిచేలా, ఆమె పరువుకు భంగం కలిగేలా పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
దీనికి సంబంధించిన వీడియో సీడీని న్యాయస్థానానికి సమర్పించారు. ఆధారాలను పరిశీలించిన న్యాయమూర్తి పిటిషన్‌ను విచారణకు స్వీకరించి.. వివేకానందరెడ్డికి సమన్లు జారీ చేశారు. దీంతో మార్చి 8న ఆనమ్ కోర్టు ముందు హాజరుకానున్నారు.












Click it and Unblock the Notifications