ఏపీలో కరోనా: మళ్లీ పెరిగిన వ్యాప్తి -కొత్తగా 3,841 కేసులు, 38 మరణాలు -ఉభయ గోదావరిలో ఎక్కువగా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి పెరిగింది. కిందటి రోజుతో పోల్చుకుంటే టెస్టుల సంఖ్య అదే స్థాయిలో ఉన్నా, కొత్త కేసులు, మరణాలు పెరిగాయి. మరోవైపు రికవరీలు సైతం స్వల్పంగా తగ్గాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. వివరాలివి..
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం వెలువరించిన లెక్కల ప్రకారం, గడిచిన 24 గంటల్లో 90,574 శాంపిళ్లను పరీక్షించగా, కొత్తగా 3,841 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18,93,354కు పెరిగింది. కొత్తవాటిలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 760 కేసులు నమోదుకాగా, చిత్తూరు 616, పశ్చిమ గోదావరిలో 504 కేసులు వచ్చాయి. అనంతపూర్ 141, గుంటూరు 313, కడప 171, కృష్ణ 350, కర్నూలు 45, నెల్లూరు 261, ప్రకాశం 296, శ్రీకాకుళం 113, విశాఖపట్నం 163, విజయనగరం 108 కేసులు నమోదయ్యాయి.

గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల 38 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,744కు పెరిగింది. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 8మంది చనిపోగా, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో ఐదుగురు చొప్పున, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరిలో ముగ్గురు చొప్పున, అనంతపూర్, కడప, విజయనగరంల్లో ఇద్దరేసి, కర్నూల్, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
నిన్న ఒక్కరోజే 3,963 మంది కొవిడ్ నుంచి రికవరీ అయ్యారు. దీంతో రికవరీ కేసుల సంఖ్య 18,42,432కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 38,178 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఐదు మినహా.. మిగిలిన అన్ని జిల్లాలోనూ పాజిటివిటీ రేటు తగ్గిందని, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న కర్ఫ్యూ సత్ఫలితాలను ఇస్తోందని గణాంకాల్లో వెల్లడైంది.












Click it and Unblock the Notifications