పెట్రోల్ పై మరో బాదుడు?

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ఇటీవలే పెట్రోల్, డీజిల్ రేట్లను భారీగా పెంచింది. లీటర్ పై రూ.3.50 పైసల మేర వడ్డించింది. ఈ పెంపు ఇక్కడితో ఆగకపోవచ్చు. మున్ముందు వీటి రేట్లు భారీగా పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, డాలర్ తో పోల్చుకుంటే రూపాయి విలువ భారీగా పడిపోతోండటం వల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు వచ్చే భారీ నష్టాలను పూడ్చుకోవడానికి వాహనదారులపై పడ్డాయి.

భారీ నష్టాల నేపథ్యంలో లీటరుపై తాజాగా పెంచిన ధరలు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ఏమాత్రం సరిపోవడం లేదు. నష్టాలు తీవ్రంగా ఉన్నందున, రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 10 రూపాయల వరకు పెరగే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ముడి చమురు ధరల పెరుగుదల చమురు కంపెనీలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఫిబ్రవరిలో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ 70 డాలర్లు ఉన్న క్రూడ్ ఆయిల్ ధర.. యుద్ధం ప్రారంభమైన తర్వాత 120 మార్కును దాటింది.

Oil Marketing Companies Brace for Higher Costs Regular Petrol and Diesel Prices face another Hike

దీంతో ధరలు పెంచాలనే ఒత్తిడి కంపెనీలపై విపరీతంగా పెరిగింది. ఈ త్రైమాసికంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు మొత్తం 57,000 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల కంటే ముందే ప్రైవేట్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. షెల్ ఇండియా, నయారా ఎనర్జీ వంటి కంపెనీలు గత నెలలోనే ఇంధన ధరల పెంపు నిర్ణయం తీసుకున్నాయి. కాగా.. నేడు పెట్రోల్, డీజిల్ ధరలలో మళ్లీ ఎలాంటి మార్పు లేదు.

వివిధ ప్రధాన నగరాల్లో ఉన్న పెట్రోల్ ధరలు

న్యూఢిల్లీ- రూ. 97.77, ముంబై - రూ. 106.64, కోల్‌కతా - రూ.108.74, చెన్నై - రూ.103.90, గురుగ్రామ్ - రూ.98.29, నోయిడా - రూ.98.04, బెంగళూరు - రూ.106.17, భువనేశ్వర్ - రూ.104.75, చండీగఢ్ - రూ.97.27, హైదరాబాద్ - రూ.110.89, జైపూర్ - రూ.108.19, లక్నో - రూ.97.58, పాట్నా - రూ.108.55, తిరువనంతపురం - రూ.110.75.

వివిధ ప్రధాన నగరాల్లో ఉన్న డీజిల్ ధరలు

న్యూఢిల్లీ - రూ.90.67, ముంబై - రూ.93.14, కోల్‌కతా - రూ.95.13, చెన్నై - రూ.95.47, గురుగ్రామ్ - రూ.90.77, నోయిడా - రూ.91.31, బెంగళూరు - రూ.94.10, భువనేశ్వర్ - రూ.96.11, చండీగఢ్ - రూ.85.25, హైదరాబాద్ - రూ.98.96, జైపూర్ - రూ.93.43, లక్నో - రూ.90.87, పాట్నా - రూ.94.63, తిరువనంతపురం - రూ.99.63.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+