• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీలో కరోనా:ఒక్కరోజులో 5,022.. ఆ రెండు జిల్లాల్లో భీకరం.. పెరిగిన కేసులు.. జగన్‌కు థ్యాంక్స్ చెబుతూ

|

ఆంధ్రప్రదేశ్ లో కరోనాపై యుద్ధం జోరుగా సాగుతోంది. మహమ్మారి నియంత్రణలో మాస్ టెస్టింగ్స్ అవసరాన్ని ముందే గుర్తించిన సీఎం జగన్.. సౌత్ కొరియా నుంచి లక్షల సంఖ్యలో ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ తెప్పించారు. దీంతో అన్ని జిల్లాల్లోనూ కరోనా పరీక్షలు ఊపందుకున్నాయి. టెస్టింగ్స్ వేగంగా చేపట్టేకొద్దీ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూవస్తోంది. ఆమేరకు ఇప్పటికే ఆస్పత్రుల్ని సిద్ధం చేసి ఉంచడంతో చికిత్స ప్రక్రియ నిరాటంకంగా సాగుతున్నది. టెస్టులు, కేసులకు సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ సోమవారం తాజా బులిటెన్ విడుదల చేసింది.

ఇదీ తాజా సీన్..

ఇదీ తాజా సీన్..

ఏపీలో గడిచిన 24 గంటల్లో మొత్తం 5,022 శాంపిల్స్ ను పరీక్షించినట్లు హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. దీంతో ఇప్పటిదాకా జరిపిన టెస్టింగ్స్ సంఖ్య 35,755కు పెరిగింది. అలాగే, గత 24 గంటల్లో కొత్తగా 35 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. తద్వారా మొత్తం కేసుల సంఖ్య 757కు పెరిగింది. ఇందులో 96 మంది వ్యాధి నుంచి కోలుకోగా, 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతానికి యాక్టివ్ కేసుల సంఖ్య 639గా ఉందని హెల్త్ మినిస్ట్రీ చెప్పింది.

ఆ రెండు జిల్లాల్లో..

ఆ రెండు జిల్లాల్లో..

రాష్ట్రంలో తొలి నుంచి కరోనా మోస్ట్ ఎఫెక్టెడ్ జిల్లాలుగా కొనసాగుతోన్న కర్నూలు, గుంటూరులో పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. టెస్టింగ్స్ విస్తృతితో కేసుల సంఖ్యా భారీగా పెరుగుతూనే ఉంది. కర్నూలు జిల్లాలో గత 24 గంటల్లో ఏకంగా 10 కొత్త కేసులు వచ్చాయి. ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య అత్యధికంగా 184కు పెరిగింది. జిల్లాలో ఇప్పటికే ఐదుగురు చనిపోయారు. ఇటు గుంటూరు జిల్లాలో గత 24 గంటల్లో 9 కొత్త కేసులు, 2 మరణాలు సంభవించాయి. ఇక్కడ మొత్తం కసుల సంఖ్య 158కాగా, అందులో 15 మందికి వ్యాధి నయమైపోయింది, మరణాల సంఖ్య 6కు పెరిగింది.

మిగతా జిల్లాల్లో..

మిగతా జిల్లాల్లో..

కర్నూలు, గుంటూరులో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతుండగా, మిగతా జిల్లాల్లో కాస్త నెమ్మదిగా సాగుతోంది. గత 24 గంటల్లో కర్నూలులో 10, గుంటూరు 9 కోత్త కేసులురాగా, సీఎం సొంత జిల్లా కడపలో 6, వెస్ట్ గోదావరి 4, కృష్ణా 3, అనంతపురం జిల్లాలో3 కొత్త కేసులు నమోదయ్యాయి. తద్వారా మొత్తం 83 కేసులతో కృష్ణా జిల్లా మూడో స్థానంలో ఉంది. నెల్లూరు జిల్లాలో 67, చిత్తూరు 53, కడప 46, ప్రకాశం 44, వెస్ట్ గోదావరి 39, అనంతపురం 36, తూర్పు గోదావరి 26, విశాఖపట్నం జిల్లాలో 21 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఇప్పటికీ కరోనా ఫ్రీ జిల్లాలుగానే కొనసాగుతున్నాయి.

  Coronavirus : Telangana Government Decided To Take Corona Samples @ Home
  ఫ్రూట్స్ హోం డెలివరీ షురూ..

  ఫ్రూట్స్ హోం డెలివరీ షురూ..

  కరోనా కాలంలో రోగనిరోధక శక్తి పెంచే ఆహారాన్ని ప్రజలకు అందిస్తామన్న జగన్ సర్కారు.. మంగళవారం నుంచి రూ. 100లకే ఐదు రకాల పండ్ల డోర్‌ డెలీవరి సదుపాయాన్ని ప్రారంభించింది. ముందుగా రాజమండ్రి, అమలాపురం, కాకినాడలో దీన్ని ప్రయోగాత్మకంగా చేపట్టారు. కాకినాడలో మంత్రి కన్నబాబు, ఎంపీ వంగా గీత తొలిగా పండ్ల పంపిణీ చేశారు. ఉద్యానవన రైతులకు మేలు జరిగేలా.. వినియోగదారులకు చౌకగా పండ్లు అందించేలా కిట్ల రూపంలో డోర్‌ డెలీవరీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఈ కార్యక్రమంలో భాగస్వామిగా కొనసాగుతోంది. తమకు అవకాశం ఇచ్చినందుకుగానూ సీఎం జగన్ కు స్విగ్గీ సంస్థ థ్యాంక్స్ చెప్పింది.

  English summary
  35 new COVID19 positive cases reported in andhra pradesh in the past 24 hours. Total number increased to 757. the state health ministry told that in last 24 hours 5022 samples tested
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X