Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో కరోనా: భారీగా కొత్త కేసులు - 5లక్షలకు చేరువగా - డిశ్చార్జీల్లోనూ రికార్డు - ఆ 4 జిల్లాల్లో..

కరోనా బాధిత రాష్ట్రాల జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో వైరస్ వ్యాప్తి వేగంగా కొనసాగుతున్నది. వైద్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,794 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5 లక్షలకు చేరువగా 4.98లక్షలలకు పెరిగింది.

Recommended Video

    COVID-19 In India : 90,633 కొత్త కేసులు, US, Brazil కలిపినా ఇండియాకు సమానం కాలేదు!! | Oneindi Telugu

    గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కరోనా వల్ల 70 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లాలో తొమ్మిది మంది, అనంతపూర్ 8, గూంటూరు 8, ప్రకాశం 8, కడపలో 7, తూర్పు గోదావరి 5, విశాఖపట్నం 5, పశ్చిమగోదావరి 5, కృష్ణా జిల్లాలో 4, కన్నూలు 4, నెల్లూరు 4, శ్రీకాకుళంలో 2, విజయనగరంలో ఒక మరణం చోటుచేసుకున్నాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4417కు పెరిగింది.

    covid-19 in ap: 10,794 new cases and 70 deaths registered in last 24 hours

    కొత్త కేసుల పరంగా నాలుగు జిల్లాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. తూర్పు గోదావరిలో కొత్తగా 1244 కేసులు, పశ్చిమగోదావరిలో 1101, నెల్లూరు 1299, ప్రకాశం జిల్లాలో 1042 కొత్త కేసులు వచ్చాయి. చిత్తూరు(927), కడప(904)లోనూ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. అనంతపురంలో కొత్తగా 753, గుంటూరులో 703, కర్నూలులో 380, శ్రీకాకుళం 818, విశాఖపట్నం 573, విజనగరం జిల్లాలో 593 కొత్త కేసులు నమోదయ్యాయి.

    మొత్తం కేసుల సంఖ్యతోపాటు యాక్టివ్ కేసుల పరంగానూ ఏపీ దేశంలో టాప్-2లో కొనసాగుతున్నది. ఆదివారం నాటికి రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 99,689గా ఉంది. ఇదిలా ఉంటే, రికవరీల్లోనూ ఇవాళ మెరుగైన గణాంకాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 11,915 మంది వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 72,573 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య శాఖ తెలిపింది. దీంతో ఏపీలో నిర్వహించిన మొత్తం టెస్టుల సంఖ్య 41.07లక్షలకు పెరిగింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+