• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీలో కరోనా: మళ్లీ పెరిగిన కేసులు, మరణాలు -ప్రకాశంలో జీరో -రేపట్నుంచి రెండో దశ వ్యాక్సినేషన్

|

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ స్వల్పంగా పెరిగింది. కిందటి రోజుతో పోల్చుకుంటే కొత్త కేసులు, మరణాలు పెరిగాయి. డిశ్చార్జీలు కూడా పెరగడంతో యాక్టివ్ కేసులు ఇంకా కిందికి పడిపోయాయి. పంచాయితీ ఎన్నికల వివాదం కారణంగా ఆకస్మికంగా నిలిచిపోయిన వ్యాక్సినేషన్ ప్రక్రియ తిరిగి పట్టాలెక్కనుంది. వివరాల్లోకి వెళితే..

నిమ్మగడ్డ మార్కు: 2,386 సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ,2,245 వార్డు మెంబర్లవి కూడా

ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం సాయంత్రం విడుదల చేసిన కరోనా బులిటెన్ వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 29,309 శాంపిళ్లను పరీక్షించగా, కొత్తగా 104 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,88,004కు పెరిగింది. ఇప్పటిదాకా 1కోటి 31లక్షల 89వేల 103 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొన్నారు. ఇక

 COVID-19 in ap: 104 new cases and 2 deaths in last 24 hrs, state tally cross 8.88 lakh

రాష్ట్రంలో కరోనా వల్ల నిన్న ఒక్కరోజే ఇద్దరు మరణించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మరణాలు నమోదైనట్లు బులిటెన్ లో తెలిపారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 7,156కు పెరిగింది. కొత్తగా 147 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకోగా, మొత్తం డిశ్చార్జీల సంఖ్య 8,79,651కి పెరిగింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 1197కు తగ్గింది. కాగా,

కొత్తగా వెలుగుచూసిన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా విశాఖపట్నంలో 27, కృష్ణాజిల్లాలో 25, చిత్తూరులో 17 కేసులు వచ్చాయి. మిగతా జిల్లాల్లో కొత్త కేసులు సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యాయి. ప్రకాశం జిల్లాలో ఆది, సోమవారాల్లో కొత్తగా ఒక్క కేసు కూడా రాకపోవడం గమనార్హం. కొద్దిరోజులుగా నిలిచిపోయిన వ్యాక్సినేషన్ ప్రక్రియ బుధవారం నుంచి పున:ప్రారంభం కానుంది..

జగన్ వల్ల జనంలో సోమరితనం -దాన్ని మోదీ సహించరు -అందుకే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి సున్నా: వైసీపీ ఎంపీ

బుధవారం నుంచి ఏపీలో రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. రెండో దశలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీ, మున్సిపల్ శాఖలకు చెందిన ఉద్యోగులకు వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది. ఇప్పటికే 5 లక్షల మందికి పైగా కరోనా వ్యాక్సిన్ కోసం పేర్లు నమోదు చేయించుకున్నారు. ఎన్నికల్లో పాల్గొంటున్న సిబ్బంది మాత్రం ప్రక్రియ పూర్తయిన తర్వాతే వ్యాక్సిన్ తీసుకోనున్నారు. ఇక, గుంటూరు జీజీహెచ్ వర్కర్ మరణానికి కారణం వ్యాక్సినా, మరొకటా అనేది ఇంకా తెలియాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు.

English summary
The cumulative coronavirus positive cases in Andhra Pradesh rose to 8,88,004 as 104 were added afresh in 24 hours ending 9 am on Tuesday, even as the active caseload fell below 1,200. The total recoveries increased to 8,79,651 as 147 more patients got cured. The overall COVID-19 toll rose to 7,156 with two fresh fatalities, a health department bulletin said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X