ఏపీలో కరోనా: కొత్తగా 172 కేసులు -ఒకరి మృతి -టీకాల పంపిణీపై కేంద్రాకి జగన్ సర్కారు లేఖ

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 172 మంది కరోనా బారిన పడ్డారు. మహమ్మారి కాటుకు మరొకరు మృత్యువాత పడ్డారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం వెలువరించిన కరోనా బులెటిన్ ప్రకారం...

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 38,323 శాంపిల్స్ పరీక్షించిన వైద్యులు.. 172 మందికి కరోనా సోకినట్లు తేల్చారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,87,238కు పెరిగింది. కడపజిల్లాలో ఒక మరణంతో ఇప్పటిదాకా చనిపోయివారి సంఖ్య 7,150 కు చేరింది.

covid-19 in ap: 172 new cases, one death in last 24 hrs state tally reaches 8.87lakh

కొత్తగా 203 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 8,78,731కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,357 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. వీరిలో కొందరు హోంఐసోలేషన్‌లో ఉండగా.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక..

ఏపీలో పంచాయితీ ఎన్నికలు పెట్టాల్సిందేనని సుప్రీంకోర్టు చెప్పడంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలను పాటించేందుకు జగన్ సర్కారు సిద్ధమైంది. అయితే, కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతున్న సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్లను ఎన్నికల విధుల్లో వాడుకోవడంపై, వ్యాక్సినేషన్ గైడ్ లైన్లలో స్పష్టత కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రానికి లేఖ రాసింది. టీకాలు, ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వం లేఖలో పేర్కొంది. దీనిపై కేంద్రం స్పందించాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+