వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కరోనా: తగ్గిన వైరస్ వ్యాప్తి -కొత్తగా 1728 కేసులు, 9మరణాలు -ఉభయ గోదావరిలో మాత్రం

|
Google Oneindia TeluguNews

సెకండ్ వేవ్ తలెత్తొచ్చన్న అనుమానాలు కొనసాగుతున్నా... ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిస్థితులు మెరుగుపడుతున్నట్లు గణాంకాల్లో వెల్లడవుతోంది. టెస్టుల సంఖ్యను భారీగా పెంచుతూ పోతున్నా.. కొత్తగా బయటపడుతోన్న కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుండటం గమనార్హం. మరోవైపు డిశ్చార్జీలు కూడా భారీగా ఉంటుండటంతో యాక్టివ్ కేసులు దాదాపు నియంత్రణ దశకు వచ్చాయి. వివరాల్లోకి వెళితే..

నర్సు కిరాతకం: సినీ ఫక్కీలో 8 మంది శిశువుల హత్య -మరో 10మందినీ -చీమకు కూడా హాని చేయదునర్సు కిరాతకం: సినీ ఫక్కీలో 8 మంది శిశువుల హత్య -మరో 10మందినీ -చీమకు కూడా హాని చేయదు

ఏపీ వైద్య ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 77,148 శాంపిళ్లను పరీక్షించగా.. కొత్తగా 1728 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 9 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,49,705కు, మొత్తం మరణాల సంఖ్య 6837కి చేరింది. చనిపోయినవారిలో చిత్తూరు జిల్లాకు చెందిన ముగ్గురు, కృష్ణాజిల్లాలో ఇద్దరు, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.

 covid-19 in ap: 1728 new cases, 9 deaths reported in last 24 hours, tally nears 8.5lakh

అదే సమయంలో రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల నుంచి 1,777మంది డిశ్చార్జ్ అయ్యారు. తద్వారా కొవిడ్ వ్యధి నుంచి కోలుకున్నవారి సంఖ్య 8,22,011కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 20,857గా ఉన్నట్లు బులిటెన్ లో తెలిపారు. ఇప్పటిదాకా ఏపీలో నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య 89, 40, 488గా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక..

షాకింగ్: ట్రంప్ ఆరోపణలు నిజమే -ఆధారాలతో విజిల్ బ్లోయర్లు -డొమినియన్ ఓటింగ్ సిస్టమ్ అక్రమాలంటూషాకింగ్: ట్రంప్ ఆరోపణలు నిజమే -ఆధారాలతో విజిల్ బ్లోయర్లు -డొమినియన్ ఓటింగ్ సిస్టమ్ అక్రమాలంటూ

కొత్త కేసులకు సంబంధించి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉధృతి ఇంకా తగ్గినట్లు లేదు. గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 290, పశ్చిమగోదావరి జిల్లా 239, కృష్ణా జిల్లాలో 223, గుంటూరు జిల్లాలో 212, చిత్తూరు జిల్లాలో 206, అనంతపురం జిల్లాలో 99, నెల్లూరు జిల్లాలో 91, ప్రకాశం జిల్లాలో 88, కడప జిల్లాలో 85, విశాఖపట్నం 74, శ్రీకాకుళం జిల్లాలో 43, విజయనగరం జిల్లాలో 42, కర్నూలు జిల్లాలో 36 కొత్త కేసులు నమోదయ్యాయి.

English summary
Over 77,000 sample tests in 24 hours ending 9 am on Thursday turned out 1,728 fresh cases of COVID-19 in Andhra Pradesh, taking the infection count to 8,49,705. Also, 1,777 patients got cured while nine more succumbed during the period, the latest bulletin said. After 8,22,011 recoveries and 6,837 deaths, the number of active coronavirus cases stood at 20,857, it said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X