ఏపీలో కరోనా: తగ్గిన వైరస్ వ్యాప్తి -కొత్తగా 18,767 కేసులు, 104 మరణాలు -ఉభయగోదావరిలో భారీగా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. రోజువారీ టెస్టులు అదే స్థాయిలో కొనసాగుతున్నా, కొత్తగా వెలుగులోకి వస్తోన్న కేసులు తగ్గుతున్నాయి. అయితే మరణాలు మాత్రం భారీగానే ఉన్నాయి. తొలి దశలాగే రెండో వేవ్ లోనూ ఉభయ గోదావరి జిల్లాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. వివరాలివి..
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 91,629 శాంపిళ్లను పరీక్షించగా, కొత్తగా 18,767 పాజిటివ్ కేసులు తేలాయి. కొత్త కేసులతో కలిపి ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 15,80,827కి చేరింది. కొత్త కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరిలో 2887 కేసులు, చిత్తూరులో 2323, పశ్చిమ గోదావరి 1972, అనంతపురం 1846, విశాఖపట్నం 1668, గుంటూరు 1249, కర్నూలు 1166, ప్రకాశం 1162, నెల్లూరు 1045 కేసులు వచ్చాయి.

కరోనా కాటుకు ఏపీలో నిన్న ఒక్కరోజే 104 మంది బలయ్యారు. దీంతో ఇప్పటిదాకా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10,126కి పెరిగింది. నిన్నటి మరణాల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 15 మంది, పశ్చిమగోదావరిలో 13 మంది, విజయనగరంలో 11 మంది, విశాఖపట్నంలో 9 మంది, అనంతపురం,తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణ, కర్నూలు జిల్లాల్లో 8 మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, నెల్లూరులో ఆరుగురు, కడప జిల్లాలో ముగ్గురు చొప్పున మృతి చెందినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటం ఊరటకలిగిస్తున్నది. నిన్న ఒక్కరోజే కొవిడ్ నుంచి 20,109 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 13,61,464కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,09,237గా ఉంది. ఏపీలో కరోనాకుతోడు బ్లాక్ ఫంగస్ మరణాలు పెరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications