ఇదెక్కడి అరాచకం అన్నా.. బిగ్గెస్ట్ కమ్ బ్యాక్ మూవీ..!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాలు అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. తమిళ్ తో పాటు తెలుగులోనూ అదే రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య. గజిని సినిమాతోనే సూర్యకు తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఆ తర్వాత యముడు, సింగం, 24, ఆకాశమే హద్దురా, సెవెన్త్ సెన్స్, జై భీమ్, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, వీడొక్కడే తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు సూర్య. అందువల్ల సూర్య సినిమా తమిళంతోపాటుగా తెలుగులోనూ గ్రాండ్ గా రిలీజ్ అవుతుంటాయి.
అయితే సూర్య నటించిన తాజా మూవీ 'వీరభద్రుడు(కరుప్పు)' ఈ మూవీ వేసవి కానుకగా మే 15 విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిలీజ్ కు ముందు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ ప్రస్తుతం థియేటర్లలో ఈ మూవీ రచ్చ రచ్చ చేస్తోంది. 2005 లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం 'ఆరు' తర్వాత దాదాపు రెండు దశాబ్దాల అనంతరం సూర్య, త్రిష జంటగా నటించిన సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. అందుకు అనుగుణంగానే తొలి రోజే సూర్య, త్రిష వీరభద్రుడు సినిమాకు 20 కోట్లు వచ్చినట్లు సమాచారం.
ఇక దేశవ్యాప్తంగా కరుప్పు మూవీ మొత్తం 4,890 కుపైగా షోలలో ఈ సినిమా ప్రదర్శితం అయింది. అలా సగటున 50.35 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఉదయం షోలకు ఆక్యుపెన్సీ కొంత నెమ్మదిగా అంటే కేవలం 24.54 శాతంతో ప్రారంభమైంది. అయితే టాక్ పాజిటివ్ రావడంతో మధ్యాహ్నం నుంచి థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య పెరిగింది. అటు ఓవర్సీస్ లోనూ కరుప్పు సినిమాకు దాదాపు రూ. 4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. రానున్న రోజుల్లో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

ఈ మూవీని నటుడు, డైరెక్టర్ ఆర్జే బాలాజీ తెరకెక్కించారు. ఈ మూవీకి సాయి అభ్యంకర్ సంగీతం అందించాడు. సూర్య, త్రిషతో పాటు ఈ మూవీలో జార్జ్ మరియన్, ఇంద్రాన్స్, నటరాజన్, స్వసిక, మన్సూర్ అలీ ఖాన్ ఇలా అందరూ తమ నటనతో మెప్పించారు.












Click it and Unblock the Notifications