వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కరోనా: మళ్లీ తిరగబెట్టిందా?-రికవరీలను మించి కొత్త కేసులు -ఆగని మరణాలు -2కోట్లకు చేరువగా టీకాలు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయ పరిస్థితులు మళ్లీ తిరగబెడుతున్నాయా? అనే అనుమానాలను రేకెత్తిస్తూ, గడిచిన నాలుగు రోజులుగా వ్యాధి నుంచి కోలుకుంటోన్నవారి సంఖ్య కంటే కొత్తగా పాజిటివ్ కు గురవుతోన్న వ్యక్తుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. మరణాలు కూడా ఎంతకూ అదుపులోకి రాకపోవడం కలవరపెడుతున్నది. వ్యాక్సినేషన్ ప్రక్రియ మాత్రం వేగంగా కొనసాగుతున్నది. వివరాలివి..

నా ఫోన్‌కు ప్లాస్టర్ చుట్టుకున్నా -మోదీని తరిమేసేలా ఢిల్లీకి ఖేలా హోబే -ప్రధాని స్థాయిలో మమత సంచలనంనా ఫోన్‌కు ప్లాస్టర్ చుట్టుకున్నా -మోదీని తరిమేసేలా ఢిల్లీకి ఖేలా హోబే -ప్రధాని స్థాయిలో మమత సంచలనం

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గడిచిన 24 గంటల్లో మొత్తం 86,280 శాంపిళ్లను పరీక్షించగా, కొత్తగా 2,527 మంది పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 19,43,854కు పెరిగింది. కొత్త కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 515, చిత్తూరు 318, ప్రకాశం 303, పశ్చిమ గోదావరి 288, కృష్ణా 249, నెల్లూరు జిల్లాలో 206 కేసులు నమోదయ్యాయి.

covid-19 in ap: 2,527 new cases, 19 deaths in last 24 hrs, vaccine doses above 1.86 crore

ఏపీలో కరోనా కాటుకు నిన్న ఒక్క రోజే 19 మంది బలయ్యారు. మొత్తంగా ఇప్పటిదాకా 13,197 మంది చనిపోయారు. తాజా మరణాల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో నలుగురు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురేసి, తూర్పు గోదావరి, ప్రకాశం, పశ్చిమ గోదావరిలో ఇద్దరు చొప్పున, కడప, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు.

సాధారణంగా కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టే క్రమంలో, కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్య అధికంగా నమోదవుతుంది. కానీ ఏపీలో మాత్రం గడిచిన నాలుగు రోజులుగా రికవరీల కంటే కొత్త కేసులే అధికంగా వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్త కేసులు 2,527కాగా, రికవరీలు 2,412గా ఉన్నాయి. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 19,06,718కి పెరిగింది. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసులు 23,939గా ఉన్నాయి. కాగా,

Recommended Video

Covid-19 Third Wave లో భారత్ లో రోజుకు 1 లక్ష కేసుల నమోదుకు అవకాశం - ICMR | Oneindia Telugu

సీఎం కేసీఆర్,టీఆర్‌ఎస్‌ను దెబ్బ కొట్టేలా హుజూరాబాద్ బరిలో 1000 మంది ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు -నాడు కవితపైసీఎం కేసీఆర్,టీఆర్‌ఎస్‌ను దెబ్బ కొట్టేలా హుజూరాబాద్ బరిలో 1000 మంది ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు -నాడు కవితపై

వ్యాక్సినేషన్ ప్రక్రియలో దూసుకెళుతోన్న ఏపీలో ఇప్పటికే పంపిణీ చేసిన డోసుల సంఖ్య రెండు కోట్లకు చేరువైంది. రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌లో మహిళలే ముందంజలో ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. జూలై 17 నాటికి రాష్ట్రంలో మొత్తం 1.86 కోట్ల డోసుల టీకా వేయగా వీటిలో 1.01 కోట్ల డోసులు మహిళలేనని, జనాభా ప్రాతిపదికన ఏపీలోనే మహిళలకు అత్యధిక డోసులు వేసినట్టు తాజా గణాంకాలతో వెల్లడైంది.

English summary
Andhra Pradesh reported 2,527 new covid positive cases and 19 deaths in last 24 hours according to state health department covid bulletin released on wednesday. with 2,412 new recoveries ap's total recoveries reached to 19,06,718. right now Active Cases in ap stands at 23,939. until july 17th, ap gas distribution above 1.86 crore vaccine doses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X