ఏపీలో తగ్గని కరోనా ఉధృతి - కొత్తగా 7,895 కేసులు, 93 మరణాలు - ఆ 4 జిల్లాల్లో డేంజర్..
దక్షిణాదిలో తమిళనాడుకు దీటుగా ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్నది. పరీక్షల సంఖ్యకు అనుగుణంగా కొత్త కేసులు వెల్లువలా వస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా భారీగా ఉంటుండటం ప్రజల్ని బయపెడుతున్నది. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,895 కేసులు, 93 మరణాలు నమోదయ్యాయి.
కాంగ్రెస్ చీఫ్ పోస్టు నుంచి తప్పుకుంటా - సీనియర్ల లేఖకు సోనియా గాంధీ రిప్లై - సీడబ్ల్యూసీపై టెన్షన్
కొత్త కేసులతో కలిపి ఏపీలో మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 3.53లక్షలకు పెరిగింది. ఇటు, డిశ్చార్జీల సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. గడిచిన 24 గంటల్లో 7,449 మంది వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తంగా వ్యాధి నుంచి కోలుకున్నవాళ్ల సంఖ్య 2.60లక్షలకు పెరిగింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 89,742గా ఉన్నట్లు బులిటెన్ లో పేర్కొన్నారు.

రాష్ట్రంలో కరోనా కాటుకు బలైపోతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. గడిచిన 24 గంటల్లో మొత్తం 93 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో అత్యధికంగా నెల్లూరు జిల్లాకు చెందినవాళ్లు 16 మందికాగా, పశ్చిమ గోదావరిలో 13 మంది, చిత్తూరులో 11మంది, కర్పూల్ లో 10మంది, ప్రకాశంలో 9మంది, కడపలో 8మంది, శ్రీకాకుళంలో ఆరుగురు, విశాఖపట్నంలో అయిదుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, అనంతపూర్ లో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, మరియు విజయనగరంలో ఇద్దరు మరణించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.
కొత్త కేసులు మరణాల పరంగా తూర్పుగోదావరి సహా చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈస్ట్ లో కొత్తగా 1256 కేసులు,4 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 49,245కు, మరణాలు 326కు పెరిగి మోస్ట్ ఎఫెక్టెడ్ జిల్లాగా కొనసాగుతున్నది. నెల్లూరులో కొత్తగా 985 కేసులురాగా, అత్యధికంగా 16 మంది చనిపోయారు. చిత్తూరులో 934 కేసులు, 11 మరణాలు, ప్రకాశంలో 923 కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి.
ఎస్పీ బాలు 54ఏళ్ల కళాప్రస్థానం - సుగుణాలు నేర్పారన్న విజయశాంతి - తమిళనాడు సర్కార్ కీలక ప్రకటన
దేశంలో అత్యధిక టెస్టులు జరుపుతున్న రాష్ట్రాల్లో ఏపీ టాప్ 3వ స్థానంలో ఉంది. గడిచిన 24 గంటల్లో 46,712 శాంపిల్స్ ను పరీక్షించినట్లు వైద్య శాఖ పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 32.38 లక్షల కరోనా టెస్టులు చేసినట్లయింది.