వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ ఔదర్యం -కొవిడ్ బాధితులకు 20 రోజుల సెలవులు -మార్చి 25 నుంచే వర్తింపు

|
Google Oneindia TeluguNews

కొవిడ్ టెస్టుల దగ్గర్నుంచి వ్యాక్సిన్ల పంపిణీ దాకా చాలా అంశాల్లో ముందున్న ఆంధ్రప్రదేశ్ సర్కారు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులపైనా ఔదార్యం చూపింది. కరోనా వల్ల విధులకు హాజరుకాని ఉద్యోగులకు 20 రోజుల సెలవులు ప్రకటిస్తూ జగన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 25 నుంచీ సదరు ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది.

మార్చి 25 తర్వాత నుంచి కొవిడ్‌ పాజిటివ్‌ గా నిర్ధారణ అయి, క్వారంటైన్‌లో ఉన్న ఉద్యోగులు అందరికీ ఈ సెలవులు వర్తిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 15 రోజులు ప్రత్యేక సెలవులు గానూ, 5 రోజులు హాఫ్‌ పే లీవ్‌ కింద పరిగణించనున్నారు. ఉద్యోగం చేసే వారి కుటుంబ సభ్యులకు కొవిడ్‌ సోకినా.. ఈ సెలవులు వర్తిస్తాయని వెల్లడించింది. హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నవారిని వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌గా పరిగణిస్తామని ప్రభుత్వం పేర్కొంది.

covid-19-in-ap-jagan-govt-agreed-to-grant-20-days-leave-to-covid-affected-govt-employees

కొవిడ్ బాధిత ఉద్యోగులకు సెలవుల విషయంలో తాము చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం అంగీకరించడం సంతోషకరమని ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకూ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని చెప్పారు. మరోవైపు,

Recommended Video

Dr. Lasya Sai Sindhu, ENT and neurologist, said that doctors work hard to save the lives of patients

కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో టీచర్లకు ప్రాధాన్యం కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రస్తుతం 45 సంవత్సరాలు దాటిన వారికి చేపడుతున్న వాక్సినేషన్‌ 90 శాతం పూర్తైన తర్వాత ఉపాధ్యాయులకు, మిగిలిన వారికి వాక్సినేషన్‌ ఇవ్వాలని సూచించారు. ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు ఇప్పటికే వాక్సినేషన్‌ ఇస్తున్నామని.. 5 యేళ్లు దాటిన పిల్లలున్న తల్లులకు ప్రాధాన్యం ఇస్తున్నామని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.

English summary
Andhra Pradesh government has agreed to grant 20 days leave to covid affected government employees. According to the Federation of Government Employees, the Chief Minister YS Jagan Mohan Reddy has agreed to grant 15 days of special general leave and another 5 days of commuted leave in the same manner as the Central Government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X