ఏపీ కరోనా అప్‌డేట్- దక్షిణ కోస్తాలో మళ్లీ పెరుగుదల- 24 గంటల్లో 2886 కేసులు..

ఏపీలో కరోనా ప్రభావం తగ్గినట్టే తగ్గి మళ్లీ కొన్ని చోట్ల పెరుగుతోంది. గత కొన్నిరోజులుగా పలు జిల్లాల్లో నమోదైన కేసులే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వం ఇవాళ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌ ప్రకారం గత 24 గంటల్లో 2886 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో దక్షిణ కోస్తా జిల్లాల్లోనే అత్యధిక కేసులు ఉన్నాయి.

గత 24 గంటల్లో నమోదైన కొత్త కరోనా కేసులు గమనిస్తే అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో 493 కేసులు, కృష్ణాజిల్లా 448, తూర్పుగోదావరిలో 405 కేసులు వచ్చాయి. ఆ తర్వాత స్ధానాల్లో గుంటూరు 385, చిత్తూరు 196, విశాఖ 152, అనంతపురం 151 కేసులు నమోదయ్యయి. అత్యల్ప కేసుల జాబితాలో కర్నూలు 36 కేసులతో మెరుగ్గా నిలిచింది. ఆ తర్వాత విజయనగరం 69, శ్రీకాకుళం 77, నెల్లూరు 80 కేసులతో తర్వాతి స్ధానాల్లో నిలిచాయి. వీటితో కలుపుకుని ఇప్పటివరకూ ఏపీలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8.20 లక్షలకు చేరింది. వీరిలో 7.88 లక్షల మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. మరో 25514 మంది చికిత్స పొందుతున్నారు.

covid 19 new cases raise in south costal districts in ap, 2886 cases in last 24 hours

మరణాల విషయానికొస్తే కృష్ణా జిల్లాలో ముగ్గురు, అనంతపూర్‌, చిత్తూరు, గుంటూరు, విశాఖలో ఇద్దరేసి, తూర్పుగోదావరి, ప్రకాశం, విజయనగరం, పశ్చిమగోదావరిలో ఒక్కరు చొప్పున చనిపోయారు. దీంతో గత 24 గంటల్లో 17 మంది చనిపోయినట్లయింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 6676కు చేరింది. మరోవైపు రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకూ కాస్త మెరుగ్గా కనిపించిన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తిరిగి కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Recommended Video

    Andhra Pradesh : 2997 New Covid 19 Cases Reported In AP | Oneindia Telugu

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+