గోవు జాతి సంపద, చంపే హక్కు ఎవరికీ లేదు: ఏపీ, టీలకు హైకోర్టు ఆదేశాలు

గోవులు భారతదేశ పవిత్రమైన సంపద అని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు స్పస్టం చేసింది.

హైదరాబాద్: గోవులు భారతదేశ పవిత్రమైన సంపద అని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు స్పస్టం చేసింది. బక్రీద్ సందర్భంగా గోవులను వధించాలనేది ఇస్లాంలో ఎక్కడా చెప్పలేదని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి శివశంకర రావు తెలిపారు. ఆయన మార్చి 1న జారీ చేసిన ఆదేశాల్లో కూడా ఇదే చెప్పారు.

ఆవు, ఎద్దు, దూడలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అందుకు విరుద్దంగా వధకు అనుకూలమైనవేనంటూ సర్టిఫికేట్ ఇచ్చే పశువుల వైద్యులపై గోవధ నిషేధ చట్టం కింద చర్యలు తీసుకునేందుకు వీలుగా చట్ట సవరణలు తీసుకురావాలని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. ఇలా ధృవీకరణ పత్రాలు ఇచ్చిన వైద్యుడిపై మోసం, హాని కింద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

"Cow is sacred national wealth, no fundamental right to slaughter," Andhra HC

అంతేగాక, గోవులు, పశుగణాలను వధించినా, గాయపరిచినా నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదు చేసే విధంగా ఐపిసి సెక్షన్ 429కు సవరణలు చేయాలని హైకోర్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను ఆదేశించింది.
ఐపిసి సెక్షన్‌కు సవరణలు చేసే విధంగా ఒక నెల రోజులు గడువు ఇచ్చింది. జూలై 7వ తేదీలోగా రెండు రాష్ట్రాలు తమ ఆదేశాలను పాటించాలని సూచించింది.

నల్గొండ జిల్లా గొరికినేని తండాకు చెందిన రమావత్ హనుమ అలియాస్ హనుమంతు బక్రీద్ సందర్భంగా వధించేందుకు 63 ఆవులు, 2 ఎద్దులను మేపుతున్నాడు. ఈ క్రమంలో వీటిని విక్రయించేందుకు సిద్ధమవుతుండగా.. ఈ విషయం తెలిసిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

స్వాధీనం చేసుకున్న ఆవులు, ఎద్దులను తనకు వదిలిపెట్టేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హనుమంతు కింది కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దీంతో హనుమంతు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి శివశంకరరావు ఇటీవల విచారణ జరిపి, 97 పేజీల ఉత్తర్వులు జారీ చేశారు.

గోవు.. మెజార్టీ ప్రజలకు తల్లి, దేవుడితో సమానమని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వేదాలు, ఉపనిషత్తులతోపాటు బైబిల్ కూడా పశువధను వ్యతిరేకించిందని, ముస్లిం పాలకులు కూడా పశువధకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చారని తెలిపారు. బాబర్, అక్బర్ లాంటి చక్రవర్తులు కూడా గోవధను నిషేధించారని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+