'రేవంత్ ఆరోపణలపై చంద్రబాబు విచారణ చేయించాలి'

Posted By:
Subscribe to Oneindia Telugu

అనంతపురం: ఏపీ మంత్రులపై తెలంగాణ టీడీపీ నేత రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు.

అనంతపురంలో ఆదివారం నాడు నారాయణ మీడియాతో మాట్లాడారు. ఏపీ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడుకి రెండు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులను, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ కుటంబాలకు బీర్ల ఫ్యాక్టరీ లైసెన్స్ లు ఎలా వచ్చాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ప్రశ్నించారు.

Cpi demands to Chandrababunaidu conduct enquiry on Revanth allegations

. పోలవరం ప్రాజెక్ట్ కు చంద్రబాబు వ్యతిరేకమన్నారు. ఈ విషయాన్ని నిరూపించేందుకు తాను సిద్దమని అన్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల విస్తరణకు వ్యతిరేకంగా వారు ఉద్యమించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఏపీలోని కార్పొరేట్ కళాశాలల్లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.ఏపీ మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావుపై చర్యలు చేపట్టాలని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ కోరారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Cpi national secretary Narayana demanded Ap CM Chandrababunaidu conduct enquiry on TTDP leader Revanth Reddy allegations.He spoke to media on Sunday at Anantapuram.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి