కార్పోరేట్ రద్దుపై ధర్నా
కడప: కార్పొరేట్ కంపెనీలకు వేల కోట్ల రుణాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేయడాన్ని నిరసిస్తూ సీపీఐ పార్టీ నాయకులు కడపలో నిరసన వ్యక్తం చేశారు. బ్యాంక్ ప్రధాన కార్యాలయం ముందు సీపీఐ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. మొండి బకాయిదారులను కఠినంగా శిక్షించడంతోపాటు బ్యాంకింగ్ చట్టాలను పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు. లక్షల కోట్ల రూపాయలు బకాయిలున్న కార్పొరేట్ పెద్దలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారు ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications