జగన్‌కు ఆ సలహా ఇవ్వండి.. ప్రశాంత్ కిషోర్‌కు సీపీఐ నేత రామకృష్ణ బహిరంగ లేఖ
Recommended Video
వైసీపీకి రాజకీయ సలహాదారుడిగా వ్యవహరించిన, ఎన్నికల వ్యూహకర్త ,జేడీయూ బహిష్కృత నేత ప్రశాంత్ కిషోర్ విషయంలో జరిగిన తాజా పరిణామాలు అందరికీ తెలిసినవే . జేడీయూ లో ఉండి కూడా సీఏఏ, ఎన్నార్సీలను వ్యతిరేకించిన పీకే నితీష్ పై చేసిన పోరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశంసలు కురిపించారు. ఇక జగన్ కు కూడా కొన్ని సలహాలు ఇవ్వాలని రామకృష్ణ ప్రశాంత్ కిషోర్ కు బహిరంగ లేఖ రాశారు.
ఎన్‌పీఆర్, సీఏఏ, ఎన్‌ఆర్‌సీ అమలు విషయంలో జేడీయూలో ఉంటూనే వాటికి మద్దతివ్వాలనే బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిర్ణయాన్ని వ్యతిరేకించడం అభినందనీయమన్నారు.స్వపక్షం అయినా తప్పు చేస్తే నిలదీసేలా ఉండాలని ఆయన ప్రశాంత్ కిషోర్ సాహసాన్ని అభినందించారు . అదే సమయంలో కేంద్రం తీసుకున్న నిరంకుశ నిర్ణయాలకు దాసోమంటున్న వైసీపీకి ఒక సలహాదారుడిగా మంచి సూచనలు చేయాలంటూ ప్రశాంత్ కిషోర్ కు లేఖ రాశారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు దాసోహం అంటున్నారని, అలా కాకుండా సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సూచించండి అని ఆయన తన లేఖలో ప్రశాంత్ కిషోర్ ను కోరారు. ప్రశాంత్ కిషోర్‌కు బహిరంగ లేఖ రాసిన ఆయన సీఎం జగన్ వ్యవహార శైలిని తప్పుబట్టారు .












Click it and Unblock the Notifications