గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎవడబ్బ సొమ్మని అమరావతికి 400 కోట్లు: జగన్ చెవిలో విజయమ్మ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ నిరవధిక దీక్ష చేస్తున్న వైయస్ జగన్‌కు పలువురు మద్దతు పలుకుతున్నారు. సిపిఎం, ఎమ్మార్పీఎస్ మద్దతు పలికాయి.

శనివారం నాడు జగన్ తల్లి విజయమ్మ దీక్షా ప్రాంగణానికి వచ్చారు. కొడుకు ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుందని తెలియడంతో ఆమె వచ్చి చూశారు.

జగన్ దీక్షకు మద్దతు తెలిపిన సమయంలో... సిపిఎం మధు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎవడబ్బ సొమ్మని రాజధాని అమరావతి కోసం ఏపీ సీఎం చంద్రబాబు రూ.400 కోట్లు ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు.

జగన్ దీక్ష

జగన్ దీక్ష

ప్రత్యేక హోదా సాధన కోసం జగన్ చేపట్టిన దీక్షకు శనివారం ఉదయం నుంచి యువత, మహిళలు పెద్దఎత్తున దీక్షాస్థలికి తరలివచ్చారు. దీక్షాస్థలికి చేరుకుంటున్న యువత స్వయంగా జగన్‌ను కలిసి సెల్ఫీలు తీసుకుని సామాజిక మాద్యమాల్లో అప్‌లోడ్ చేస్తూ మద్దతు ప్రకటిస్తున్నారు.

 జగన్ దీక్ష

జగన్ దీక్ష

జగన్ నీరసిస్తున్న సమాచారం తెలుసుకున్న తల్లి వైయస్ విజయమ్మ శనివారం ఉదయం ఇక్కడకు చేరుకున్నారు. ప్రజలకు అనేకసార్లు అభివాదం చేసిన విజయమ్మ తనయుడి చేతిని వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకున్నారు. ప్రసంగించే సమయంలో కన్నీటి పర్యంతమయ్యారు.

జగన్ దీక్ష

జగన్ దీక్ష

గద్గద స్వరంతో మాట్లాడలేక ప్రసంగాన్ని దిగమింగుకున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సిఎం చంద్రబాబు దుర్మార్గపాలన కొనసాగిస్తున్నారని నిప్పులు చెరిగారు. తెలంగాణ నుంచి వైసిపి అధ్యక్షులు, ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అనుచరులతో తరలివచ్చారు.

జగన్ దీక్ష

జగన్ దీక్ష

జగన్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. జగన్ దీక్ష విజయవంతం చేసేందుకు అన్నివర్గాల ప్రజలు తరలిరావాలన్నారు. ప్రభుత్వ వైద్యులు ఎప్పటికప్పుడు జగన్ ఆరోగ్య పరిస్థితిపై పరీక్షలు నిర్వహిస్తున్నారు.

జగన్ దీక్ష

జగన్ దీక్ష

జగన్ దీక్షాస్థలికి విచ్చేసిన ఎమ్మెల్యేలు, నాయకుల ప్రసంగాలను వింటున్నారు. తనను పరామర్శించిన ఎమ్మెల్యేలను చిరునవ్వుతో తిరిగి పలుకరిస్తూ హోదా సాధనకై తీసుకోవాల్సిన చర్యలపై వారికి పలు సూచనలు కూడా చేస్తున్నారు.

జగన్ దీక్ష

జగన్ దీక్ష

అయితే జగన్ దీక్ష ప్రారంభించిన తొలి రెండు రోజులూ తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసిన అధికార పార్టీ నాయకులు సైతం నాల్గవ రోజుకు దీక్ష చేరుకుని జగన్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో జరగబోయే పరిణామాలను గమనిస్తూ స్తబ్దుగా వ్యవహరిస్తున్నారు.

జగన్ దీక్ష

జగన్ దీక్ష

ప్రభుత్వం ఆరా తీస్తోందని తెలుస్తోంది. టిడిపి నాయకత్వం కూడా దీక్ష వలన రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులపై స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా సమాచారం రాబడుతున్నట్లుగా చెబుతున్నారు.

జగన్ దీక్ష

జగన్ దీక్ష

ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవడబ్బ సొత్తని రాజధాని ఏర్పాట్లకు 400కోట్లు ఖర్చు చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు ధ్వజమెత్తారు.

జగన్ దీక్ష

జగన్ దీక్ష

గుంటూరు నల్లపాడు రోడ్డులో ప్రత్యేక హోదా సాధన కోసం జగన్ చేస్తున్న దీక్షకు మధు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. శనివారం మధు దీక్షాస్థలికి విచ్చేసి జగన్‌ను పరామర్శించిన అనంతరం మాట్లాడారు.

జగన్ దీక్ష

జగన్ దీక్ష

రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లకు ఈవెంట్ మేనేజిమెంట్‌కు 10 కోట్ల రూపాయిలు, అతిథులను స్వాగతించేందుకు 25 కోట్ల రూపాయిలు ఖర్చు పెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంపై మండిపడ్డారు.

జగన్ దీక్ష

జగన్ దీక్ష

పట్టిసీమ, నదుల అనుసంధానం అంటూ నిర్వహించిన కార్యక్రమ ఏర్పాట్లకు రూ.2.5 కోట్లు, హాజరైన వారి భోజనాలకు రూ. 2.5కోట్లు, బస్సుల్లో తరిలించినందుకు మరిన్ని కోట్ల రూపాయిలు ఖర్చు అయినట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ లేఖ రాయటం ప్రభుత్వం చేస్తున్న దుబారా ఖర్చులకు నిదర్శనమన్నారు.

English summary
CPI(M) extends support to YS Jagan's fast
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X