వెంకయ్య ఎక్కడకెళ్లినా వదలం: నారాయణ, 'వైఎస్ మృతి వెనుక బాబు హస్తం'

విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా అంశం కేంద్రమంత్రి వెంకయ్య నాయుడును శనిలా పట్టుకుందని సిపిఐ నేత నారాయణ సోమవారం నాడు వ్యాఖ్యానించారు. ఆయన రాజస్థాన్ వెళ్లినా వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. పశ్చిమ బెంగాల్లో వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదన్నారు.

కాంగ్రెస్ పార్టీతో పొత్తు వద్దని సీపీఎంకు అంతర్గతంగా సూచించామని చెప్పారు. తమ భాష, తమ విధానాలు మారాల్సి ఉందని సిపిఐ నేత నారాయణ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఫిరాయింపులకు ఆధ్యుడు వైయస్ రాజశేఖర రెడ్డియేనని విమర్శించారు.

చంద్రబాబుపై వైసిపి నేత భూమన సంచలనం

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి సోమవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతి వెనుక చంద్రబాబు హస్తం ఉండవచ్చునని ఆరోపించారు. భవిష్యత్తులో వైసిపి ఉండదన్న చంద్రబాబు వ్యాఖ్యలపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు. కాగా, వైయస్ మృతి వెనుక చంద్రబాబు హస్తం అంటూ భూమన సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం.

CPI Narayana says they will not leave Venkaiah Naidu

ముద్రగడపై మంత్రి నారాయణ మళ్లీ ఫైర్

ముద్రగడ పద్మనాభం రాజకీయ లబ్ధి కోసమే కాపులను రెచ్చగొడుతున్నారని మంత్రి నారాయణ విమర్శించారు. గతంలో వైయస్ రాజశేఖర్‌రెడ్డిని దేవుడన్న ముద్రగడ, కాంగ్రెస్‌ పదేళ్లు అధికారంలో ఉంటే కాపుల గురించి ఎందుకు పట్టించుకోలేదన్నారు.

1994లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి జారీ చేసిన జీవో.30ను అమలు చేయాలని ముద్రగడ కోరుతున్నారని, అది ఎందుకూ పనికిరాదన్నారు. 1994లో ఈ జీవో రద్దు కోసం చంద్రబాబు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారంటూ ముద్రగడ అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు.

ఆ సమయంలో ముద్రగడ టిడిపిలో చేరి ఎంపీ అయ్యారని, మరి అప్పుడు ఎందుకు బాబును వ్యతిరేకించలేదని నిలదీశారు. కాపులను చట్ట ప్రకారం బీసీల్లో చేర్చేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని, అందుకు కమిషన్‌ కూడా నియమించారన్నారు.

ప్రభుత్వం పట్టించుకోవట్లేదు: పళ్లం రాజు

తెలంగాణ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలోని ప్రాజెక్టులకు ఇబ్బంది వాటిల్లుతోందని, అయినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏపీ కాంగ్రెస్ నేత పళ్లం రాజు విజయవాడలో అన్నారు. త్వరలో తాము భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+