సీఎం ఫాంహౌస్ లో ఉంటే అదే రాజధాని అవుతుందా ? జగన్ కు కేసీఆర్ బ్లాక్ మెయిల్ : సీపీఐ నారాయణ సంచలనం
సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలుగు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అని ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం ఎక్కడుంటే అక్కడ రాజధాని ఎలా అవుతుందని ప్రశ్నించిన ఆయన, తెలంగాణ సీఎం కేసీఆర్ ఫాంహౌస్లో ఉంటే అదే రాజధాని అవుతుందా అంటూ ప్రశ్నించారు . అలాంటప్పుడు ఈ రాజ్యాంగ వ్యవస్థ మొత్తం ఎందుకు అంటూ నిలదీశారు నారాయణ. అంతేకాదు రాజ్యాంగ వ్యవస్థకు ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతారో వారిని బర్తరఫ్ చేయాలని సిపిఐ నారాయణ డిమాండ్ చేశారు.

అమరావతి రాజధాని అని ఒప్పుకున్న జగన్ .. అధికారంలోకి రాగానే మాట మార్పు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని ప్రాంతం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కూడా ఒప్పుకున్నారని పేర్కొన్న ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ మాట మార్చారని విమర్శించారు. ఇక అమరావతి రైతులతో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని చెప్పిన నారాయణ, అది చంద్రబాబు తన కుటుంబం కోసం చేసుకున్న ఒప్పందం కాదని వెల్లడించారు. ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ గత ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉండాల్సిందేనని, రజుకో రకంగా నిర్ణయాలను మార్చుకోవడం మంచిది కాదని సీపీఐ నారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు.

విజయసాయిరెడ్డి ఎంట్రీతో ఉత్సవ విగ్రహంలా బొత్సా
విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఎంట్రీతో బొత్స సత్యనారాయణ ఉత్సవ విగ్రహంగా మారారని ఎద్దేవా చేశారు. మంత్రి బొత్స రాజధాని విషయంలో ఓ వర్గం తో మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఎంత దద్దమ్మ అయినప్పటికీ ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలని హితవు పలికారు. ఏపీ ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోతుందని పేర్కొన్న సిపిఐ నారాయణ ప్రభుత్వ ఆస్తులు అమ్ముకొని ఖజానా నింపాలని చూడటం సరైన పద్ధతి కాదని విమర్శించారు.

షర్మిల పార్టీ ఎఫెక్ట్ .. కేసీఆర్, జగన్ మధ్య పెరిగిన జల వివాదాలు
తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటు చేయడంతో కవలలు గా ఉన్న కెసిఆర్, వైయస్ జగన్ ల మధ్య జలవివాదాలు మరింత జటిలమయ్యింది అని సీపీఐ నారాయణ అభిప్రాయపడ్డారు. సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన సమస్యను అడ్డుపెట్టుకొని కేసీఆర్ జగన్ ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య జల వివాదాలను కోర్టులు పరిష్కరించలేవని, రాజకీయ పరిష్కారమే మార్గమని సిపిఐ నారాయణ అభిప్రాయపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టు పై కృష్ణా జలాల వివాదం పడడంతో సమస్య మరింత జటిలంగా మారిందని నారాయణ పేర్కొన్నారు.

ఆఫ్ఘనిస్థాన్ లో అమెరికా 20 ఏళ్ళ దోపిడీ
ఇదే సమయంలో అమెరికా బలగాలు వెనుతిరిగి వెళ్లడంతో ఆప్ఘనిస్థాన్లో తాజా పరిణామాల పై స్పందించిన నారాయణ, అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్తాన్ ని వదిలి వెళ్లడంతో ప్రస్తుతం టెన్షన్ తగ్గిందన్నారు. 20 ఏళ్ల పాటు అమెరికా ఆఫ్ఘనిస్తాన్ సంపదను దోచుకున్నదని సీపీఐ నారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల సంక్షేమం కోసం అమెరికా ఆఫ్గనిస్థాన్లో తిష్ట వెయ్యలేదని, కేవలం ఆఫ్ఘనిస్తాన్ ను దోచుకోవడం కోసమే అమెరికా అక్కడకు వెళ్లిందని పేర్కొన్నారు. అమెరికా విధానాలకు భారత్ పూర్తిగా సపోర్ట్ చేసిందని పేర్కొన్న ఆయన భారతదేశ ఆఫ్ఘనిస్థాన్లో పెట్టుబడులు పెట్టిందని, ఇప్పుడు భారత్ కు అసలు సమస్య మొదలైంది అని విమర్శించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ లో భారత్ పెట్టుబడులపై సందిగ్ధత నెలకొందని నారాయణ పేర్కొన్నారు.

తాలిబన్ల పట్ల సీపీఐ సానుకూల దృక్పధం .. కానీ హింసను సపోర్ట్ చెయ్యం
ఇక తాలిబన్లను సిపిఐ పార్టీ కూడా నమ్మిందని, అలా అని హింసాకాండకు సీపీఐ ఎప్పుడూ మద్దతు పలకదని నారాయణ స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ ని వదిలి అమెరికా వెళ్ళి పోతూ తమకు సహకరించిన వారి జాబితా తాలిబన్ల చేతిలో పెట్టడం ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ విదేశాంగ విధానంలో అనేక తప్పులు చేశారని పేర్కొన్నారు నారాయణ అమెరికా, ఇజ్రాయిల్ వంటి దేశాలతో కలిసి భారత్ భవిష్యత్తు ఆలోచించకుండా చాలా తప్పు నిర్ణయాలు తీసుకున్నారన్నారు. నారాయణ రెండు తెలుగు రాష్ట్రాలలో చోటుచేసుకున్న పరిస్థితులను, దేశంలో మోడీ పాలనా విధానాన్ని, ఆఫ్ఘనిస్థాన్లో తాజా పరిస్థితులను గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
Recommended Video
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications