వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీపీఐ నారాయణ షాకింగ్- పవార్ రాష్ట్రపతి-ధర్డ్‌ ఫ్రంట్‌ అందుకే-జగన్‌, కేసీఆర్ రాత్రి భేటీలు

|
Google Oneindia TeluguNews

జాతీయ రాజకీయాల్లో విలక్షణ రాజకీయవేత్తగా పేరుతెచ్చుకున్న సీపీఐ నారాయణ ఇవాళ మరోసారి చెలరేగిపోయారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ధర్డ్‌ప్రంట్‌, ఏపీ, తెలంగాణ జలయుద్ధాలు, ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యలు, జగన్, కేసీఆర్‌ రహస్య చర్చలు.. ఇలా పలు అంశాలపై సంచలన విషయాలు ప్రస్తావించారు. ముఖ్యంగా మోడీ, కేసీఆర్‌, జగన్‌లకు తనదైన శైలిలో చురకలు అంటించారు. జాతీయ రాజకీయాల్లో ధర్డ్‌ఫ్రంట్‌ అవసరాన్ని ప్రస్తావించిన నారాయణ.. ఈ ప్రయత్నాల్ని పవార్‌ ఎందుకు ముందుండి నడిపిస్తున్నారో కూడా చెప్పారు.

ధర్డ్‌ఫ్రంట్‌తో భిన్నత్వంలో ఏకత్వం

ధర్డ్‌ఫ్రంట్‌తో భిన్నత్వంలో ఏకత్వం


దేశంలో ధర్డ్‌ఫ్రంట్‌ ఏర్పాటు కోసం శరద్ పవార్‌ ఇంట్లో తాజాగా జరిగిన సమావేశం ఓ ప్రాధమిక ప్రయత్నమని సీపీఐ నారాయణ తెలిపారు. కేంద్రంలో బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా జరిగే ప్రయత్నాలకు సీపీఐ సహకరిస్తుందన్నారు. బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌ సాధ్యాసాధ్యాలపై చర్చలు జరుగుతున్నాయని నారాయణ వెల్లడించారు. ఇన్ని వైరుధ్యాల మధ్య బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌పై అనేక ప్రశ్నలు వస్తున్నాయని, కానీ బెంగాల్‌, కేరళలో మమత, కాంగ్రెస్‌తో పడకపోయినా బీజేపీ వ్యతిరేకులుగా కలిసి పనిచేస్తామన్నారు. భిన్నాభిప్రాయాలున్నా బీజేపీ వ్యతిరేకంగా అంతా కలిసే పోరాడతామన్నారు. యూపీలో బీజేపీ కచ్చితంగా ఓడిపోవడం ఖాయమన్నారు.

పవార్‌ ప్రధాని కాదు రాష్ట్రపతి

పవార్‌ ప్రధాని కాదు రాష్ట్రపతి


ధర్డ్‌ఫ్రంట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్న శరద్‌పవార్ ప్రధాని అభ్యర్ధి కాదని రాష్ట్రపతి అభ్యర్ధి అని సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల కల్లా దేశంలో భారీమార్పులొస్తాయని నారాయణ జోస్యం చెప్పారు. దేశంలో మోడీలా అన్‌పాపులర్‌ అయిన ప్రధాని మరొకరు లేరన్నారు. ప్రస్తుతం ధర్డ్‌ఫ్రంట్‌ కోసం శరద్‌ పవార్ ఇంట్లో భేటీ పెడితే బీజేపీయేతర పార్టీలు వచ్చాయని, మరో నేత ఇంట్లో పెడితే వచ్చేవారు కాదన్నారు.

పెట్రో ధరల పెరుగుదలకు రీజన్ అదే

పెట్రో ధరల పెరుగుదలకు రీజన్ అదే

ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తగ్గుతుంటే భారత్‌లో మాత్రం పెరుగుతున్నాయని నారాయణ అన్నారు. జీఎస్టీలోకి పెట్రోల్‌, డీజిల్‌ను ఎందుకు తీసుకురారని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. ఇరాన్‌, వెనిజులా నుంచి పైప్‌లైన్ ద్వారా తీసుకుంటే చమురు చాలా చౌక అని,
కానీ అమెరికా ఒత్తిడితోనే కేంద్రం ఈ ప్రయత్నాలు చేయడం లేదన్నారు. దీనిపై ఎవరు ప్రశ్నించినా సమాధానం చెప్పలేని పరిస్ధితుల్లో కేంద్రం ఉందన్నారు. ప్రశ్నిస్తే దేశద్రోహం కేసులు, సీబీఐ కేసులు పెడుతున్నారని నారాయణ ఆరోపించారు.

 జగన్‌, కేసీఆర్ రాత్రి చర్చలెందుకు ?

జగన్‌, కేసీఆర్ రాత్రి చర్చలెందుకు ?

ఏపీకి మిగులుజలాలు వాడుకునే హక్కుందని, మిగులుజలాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకోవాలని సీపీఐ నారాయణ సూచించారు. వీరిద్దరూ రాత్రులు కలుసుకుంటున్నారని, పగలు కలుసుకోవడం లేదన్నారు. వీరి మధ్య రహస్య చర్చలెందుకని నారాయణ ప్రశ్నించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకోవాలని లేకపోతే కేంద్రమే వీరిద్దరి మధ్య మధ్యవర్తిత్వం చేసి ఓ పరిష్కారం చూపాలని నారాయణ సూచించారు.

 తెలంగాణకు జగన్‌ సాయం

తెలంగాణకు జగన్‌ సాయం


జగన్ తెలంగాణకు ఎంతో సాయం చేశాడని సీపీఐ నారాయణ వ్యాఖ్యానించారు. ప్రజల కోసం కేసీఆర్‌, జగన్ ఓపెన్‌గా మాట్లాడుకోవాలన్నారు. జగన్ మూడు రాజధానులతో తెలంగాణకు పాలుపోశాడని నారాయణ తెలిపారు. హైదరాబాద్‌ ల్యాంకో హిల్స్‌లో గతంలో 5750 ఉన్న చదరపు గజం మూడు రాజధానుల ప్రకటనతో 7999కు పెరిగిపోయిందన్నారు. ఇంత సాయ చేసిన జగన్‌కు తెలంగాణ ఏం చేయాలని నారాయణ ప్రశ్నించారు. చేసిన సాయానికి ప్రతిగా మా నీళ్లు మేం వాడుకుంటామని జగన్‌ ఎందుకు చెప్పడం లేదని నారాయణ నిలదీశారు.

కేసీఆర్‌కు ఆపద, ప్రశాంత్‌రెడ్డి నాలుక కోయాలి

కేసీఆర్‌కు ఆపద, ప్రశాంత్‌రెడ్డి నాలుక కోయాలి

జలవివాదాలపై తాజాగా తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని నారాయణ తప్పుబట్టారు. నోటికొచ్చినట్లు మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం కావు మైలేజ్‌ మాత్రమే వస్తుందన్నారు. ప్రశాంత్‌రెడ్డిలా ఎవరు మాట్లాడినా నాలుకలు కోసేయాలని నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా మాట్లాడిన మంత్రిని కేసీఆర్‌ ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదు నీళ్లు కావాలన్నారు. కేసీఆర్‌కు ఇప్పుడు పెద్ద ఆపద వచ్చిందని, ఈటెల బయటికి పోవడంతో ఉప ఎన్నికలు వస్తున్నాయన్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసీఆర్‌ జిమ్మిక్కులు చే్స్తున్నారన్నారు.

English summary
cpi national leader narayana made sensational comments on third front and ap, telangana water war in a press meet at tirupati today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X