పాకిస్థాన్ పై యుద్దానికి మేం వ్యతిరేకం - సీపీఐ నారాయణ షాకింగ్ కామెంట్స్ !
"ఆపరేషన్ సింధూర్" తో పహల్గాం ఉగ్రదాడికి భారత్ ధీటైన బదులిచ్చింది. ఈ ఆపరేషన్‌లో మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై లక్ష్యంగా దాడులు జరపగా.. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. భారత సైన్యం పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై చేసిన దాడి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ప్రజలు "జయహో భారత్" అంటూ నినాదాలు చేస్తూ, సోషల్ మీడియాలో దేశ భక్తి సందేశాలతో పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ దాడి యుద్ధానికి శ్రీకారం చుట్టినట్లే అయినా, ప్రజల ఆశయమైతే పాక్‌పై తగిన ప్రతీకారం తీసుకోవాలని భావిస్తున్నారు.
అయితే ఉగ్రవాదులపై భారత ఆర్మీ చేపట్టిన చర్యల పట్ల సర్వత్రా అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఇండియాన్ ఆర్మీకి అభినందలు తెలుపుతూ పోస్ట్ లు చేస్తున్నారు నెటిజన్స్. అలాగే పలువురు సినీ తారలు సైతం భారత ఆర్మీకి సెల్యూట్ అంటూ పోస్ట్ లు చేస్తున్నారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) నేత నారాయణ పాక్ పై యుద్ధానికి వ్యతిరేకంగా ఓ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉగ్రవాదులపై దాడిని తాము సమర్థిస్తున్నామని .. కానీ పాకిస్తాన్‌తో యుద్ధాన్ని మాత్రం సమర్థించలేమంటూ నారాయణ వ్యాఖ్యానించారు. భారత ఆర్మీ ఉగ్రవాదులను ఎదుర్కొనేలా శిక్షణ పొందిందని, పాక్‌పై యుద్ధానికి కాదని అన్నారు. ఉగ్రవాదుల నిర్మూలనే లక్ష్యంగా ముందడుగు వేయాలి కానీ దేశాల మధ్య యుద్ధం అంతిమ పరిష్కారం కాదని తెలిపారు. అంతే కాకుండా పాకిస్తాన్ కూడా ఉగ్రవాద నిర్మూలనలో భారత్‌కు సహకరించాలని కోరారు. ఒకవేళ యుద్ధమే జరిగితే అది ఉగ్రవాదానికి ఊతమిచ్చినట్టవుతుందని హిత బోధ చేశారు. నారాయణ చేసిన వ్యాఖ్యలను కొందరు సమర్దిస్తుంటే.. మరికొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
మరోవైపు ఇండియన్ ఆర్మీ దాడులు జరిపిన 9 ప్రధాన ఉగ్ర స్థావరాల్లో 4 పాకిస్తాన్‌లో, 5 పీఓకేలో ఉన్నాయి. ఇందులో ముంబై దాడుల సూత్రదారి లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కంచుకోట మురీడ్కే కూడా ఉంది. ముజఫరాబాద్‌లో 2 శిబిరాలు, కోట్‌లి, గుల్పూర్, భీమ్బర్, సియాల్‌కోట్, చకంబ్రూ, మురీడ్కే, బహావల్పూర్ వంటి ప్రదేశాలు ఇందులో ఉన్నాయి. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా శిక్షణా శిబిరాలు, కమ్యూనికేషన్ హబ్‌లు, ఆయుధ నిల్వలు తుడిచి పెట్టివేసినట్టు తెలుస్తోంది.
— Narayana Kankanala (@NarayanaKankana) May 7, 2025












Click it and Unblock the Notifications