చంద్రబాబును బీజేపీ బ్లాక్ మెయిల్ చేస్తోందా..!?

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. జగన్ ఒంటరి పోరాటానికి సిద్దమయ్యారు. పార్టీ అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైనా బీజేపీ కలిసి వస్తుందనే అంచనాతో రెండు పార్టీలు ఉన్నాయి. బీజేపీ మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తోంది. మరో వైపు కాంగ్రెస్ ఈ సారి ఏపీలో బలం పంచుకొనే ప్రయత్నాలు చేస్తోంది. ఇండియా కూటమి బంధం రాష్ట్రంలోనూ కొనసాగించేలా వ్యూహాలు అమలు చేస్తోంది.

ఏపీలో రాజకీయ పొత్తులపై సస్పెన్స్ కొనసాగుతోంది. టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ వైపు చూస్తున్నాయి. బీజేపీ పొత్తు పైన తమ నిర్ణయం తేల్చటం లేదు. అటు వైసీపీ ఎన్నికల ప్రచారానికి సిద్దం అవుతున్న వేళ..బీజేపీ పొత్తు అంశం తేలక ఈ రెండు పార్టీలు సీట్ల సర్దుబాటులో ఇంకా వేచి చూసే ధోరణితో ఉన్నాయి. ఈ నెల 25 నుంచి జగన్ ఎన్నికల పర్యటనలు ప్రారంభిస్తున్నారు. వామపక్షాలతో కలిసి జాతీయ స్థాయి తరహాలోనే ఏపీలోనూ ఇండియా కూటమి ఏర్పటు చేయాలనేది కాంగ్రెస్ ఆలోచన. కానీ, టీడీపీ బీజేపీతో కలవకుంటే తాము ఆ పార్టీతో కలుస్తామని సీపీఐ ప్రతిపాదిస్తోంది. ఇదే సమయంలో బీజేపీని చంద్రబాబు బ్లాక్ మెయిల్ చేస్తోందని నారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు.

CPI National secretary Narayana Made serious comments over BJP-TDP Alliance

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ.. సీఎం ఆదిత్యనాథ్ ఈవెంట్ ఆర్గనైజర్లుగా వ్యవహరిస్తున్నారన్నారని నారాయణ చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఓటు బ్యాంక్ కోసం బీజేపీ శ్రేణులు రాముడి అక్షింతలు ఇంటింటికి పంచుతున్నారని నారాయణ అన్నారు. అదాని భారతీయ సంపన్నుల్లో అగ్రస్థానంలో ఉన్నారన్నారు. లిక్కర్ స్కామ్‌లో సిసోడియాను జైల్లో పెట్టారన్నారు. బీజేపీతో కౌగిలించు కోవడం వల్లనే కేసీఆర్ ఓడిపోయారన్నారు. విభజన చట్టంలో ఉన్న వాటిలో కేంద్రం ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు.

CPI National secretary Narayana Made serious comments over BJP-TDP Alliance

చంద్రబాబు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని నారాయణ వ్యాఖ్యానించారు. 17ఏ ఓపెన్ చేయమంటావా.. లేకపోతే మాతో కలుస్తావా.. అని చంద్రబాబును బీజేపీ బ్లాక్ మెయిల్ చేస్తోందని నారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. ధృతరాష్ట్ర కౌగిలి కోసం అధికార ప్రతిపక్ష పార్టీల అధినేతలు ఆరాటపడుతున్నారన్నారు. బీజేపీతో కలవకపోతే తాము టీడీపీతో కలిసి నడుస్తామని నారాయణ పేర్కొన్నారు. రేవంత్ చేసిన ధైర్యంలో సగం కూడా చంద్రబాబుకు లేదని నారాయణ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+