'తమిళ-తెలుగు మధ్య చిచ్చు పెట్టిన ఆంధ్రప్రదేశ్'
హైదరాబాద్: కూలీలను చంపించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు, తమిళ రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టిందని సీపీఐ నేత రామకృష్ణ శుక్రవారం ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం నాడు విలేకరులతో మాట్లాడారు. శేషాచలం ఎన్‌కౌంటర్ ఘటన పైన సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్పోరేటర్లకు మేలు కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు. విదేశీ పర్యటనల్లో ఉన్న మోడీ దేశ ప్రతిష్టను మంటకలిపేలా ప్రసంగించారని ధ్వజమెత్తారు. మే 14వ తేదీన భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా జైల్ భరో నిర్వహిస్తామని చెప్పారు.
మరో ఐదుగురికి రీ పోస్టుమార్టం

చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారిలో మరో ఐదుగురికి రీ పోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల నుంచి ఫోరెన్సిక్ నిపుణులను పంపించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఎన్‌కౌంటర్‌పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
పట్టిసీమపై జగన్ తీరు దుర్మార్గం: బొజ్జల
రాయలసీమకు నీరందించే పట్టిసీమ ప్రాజెక్టుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ తీరు దుర్మార్గంగా ఉందని మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ఆరోపించారు. హంద్రీనీవాతోనే చిత్తూరు జిల్లాకు సాగు, తాగునీటిని అందిస్తామన్నారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. రెండో విడతలో 4 వేల టన్నుల ఎర్రచందనాన్ని వేలం వేయనున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications