పవన్ కల్యాణ్ అలా చెప్పారు- నేడు సపరేట్ అయ్యారు : సీపీఐ రామకృష్ణ..!!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేసారు. పవన్ బీజేపీని రోడ్ మ్యాప్ అడుగుతున్నారంటే ఆయనను అమాయకంగా ఉన్నారనుకోవాలా, లేక అన్నీ తెలిసి నటిస్తున్నారని భావించాలా అంటూ ప్రశ్నించారు. వైసీపీ మంత్రుల బ్లాక్‌మెయిల్‌కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ భయపడుతున్నారని రామకృష్ణ వ్యాఖ్యానించారు. బీజేపీ కి వైసీపీ పూర్తి స్థాయిలో సహకరిస్తుందని చెప్పుకొచ్చారు.
వైసీపీని ఓడించాలంటే ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావాలని చెప్పిన పవన్ కల్యాణ్.. ఇవాళ జనసేన సెపరేట్ అని అంటున్నారంటూ రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేసారు. కేంద్రానికి ప్రతీ విషయంలో వైసీపీ ఎంపీలు సహకరిస్తున్నారని వివరించారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్‌ను గద్దె దించేందుకు ఎవరితోనైనా కలసి నడుస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీలో పోలీస్ రాజ్యం నడుస్తోందని రామకృష్ణ అన్నారు. అప్పులు చేయటంలో రాష్ట్రం నెంబర్ వన్ స్థానానికి చేరుకోవటం సిగ్గుచేటన్నారు.

ఏడాదికి రూ. 41 వేల కోట్లు అప్పులు తెస్తామని చెబుతూ.. ఆరు నెలల్లోనే ప్రభుత్వం రూ. 49 వేల కోట్లు అప్పు తెచ్చిందని విమర్శించారు. పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన తరువాత విజయవాడలో స్వయంగా చంద్రబాబు జనసేన అధినేత వద్దకు వెళ్లి సంఘీభావం ప్రకటించారు. ఆ తరువాత ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో అన్ని పార్టీలను కలుపుకొని వెళ్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆ తరువాత ప్రధాని విశాఖ పర్యటనలో పవన్ సమావేశంతో సీన్ మారిపోయిందని చెబుతున్నారు. అప్పటి నుంచి పవన్ తీరులో మార్పు కనిపిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కానీ, తాజాగా కర్నూలు సభలో చంద్రబాబు మరోసారి పవన్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేసారు.
దీనికి కొనసాగింపుగా అందరినీ కలుపుకొని ఎన్నికలకు వెళ్తామని..ఓటు వేస్తారా లేదా అనేది మీ ఇష్టమంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు కారణమవుతున్నాయి. ఇప్పటికే టీడీపీతో సీపీఐ మిత్రపక్షంగా ఉంది. పవన్ కల్యాణ్ బీజేపీని వీడితేనే తిరిగి జనసేనతో కలుస్తామని వామపక్ష నేతలు చెబుతున్నారు. జనసేన - బీజేపీ కలిసే ఉన్నా.. కార్యక్రమాల నిర్వహణలో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే, పవన్ కేంద్రంగా సాగు












Click it and Unblock the Notifications