నాపై దాడులు చేసినా పట్టించుకోను, ఇది పద్దతికాదు: పవన్ కళ్యాణ్
అమరావతి: ఏపీ రాష్ట్రానికి న్యాయం చేయాలనే డిమాండ్‌తో మార్చి 1వ, తేదిన గుంటూరులో జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి రావాలని సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కె. రామకృష్ణ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ను కోరారు. మరో వైపు ప్రత్యేక హోదాపై చర్చల్లో పాల్గొన్నవారిపై దాడులకు దిగడాన్ని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు.
ఏపీ రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న లెక్కల్లో వాస్తవాలను తేల్చేందుకు ఏర్పాటు చేసిన జెఎప్‌సపి తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలపై గురువారం నాడు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చర్చించారు.
రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడ ఈ సమావేశంలో చర్చించారు. ప్రత్యేక హోదా విషయమై రాష్ట్రంలో జరుగుతున్న సభలు, సమావేశాలపై కూడ నేతల మధ్య చర్చ జరిగింది.

పవన్ కళ్యాణ్‌తో రామకృష్ణ బేటీ
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌తో సిపిఐ ఏపీ రాష్ట్ర సమితి కార్యదర్శి రామకృష్ణ సమావేశమయ్యారు. జెఎప్‌సి సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కీలకంగా వ్యవహరించారు. జెఎప్‌సి రెండు రోజుల పాటు సమావేశమైంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.జెఎఫ్‌సి సమావేశాల తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలపై చర్చించారు. మార్చి 1న గుంటూరులో జరగనున్న రౌండ్‌టేబుల్ సమావేశానికి రావాల్సిందిగా పవన్‌కల్యాణ్‌ను రామకృష్ణ ఆహ్వానించారు.

నాపై దాడులు చేసినా పట్టించుకోను
ప్రత్యేక హోదాపై టీవీల్లో చర్చలు జరుగుతుండగా దాడులు చేయడమేంటని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిలదీశారు. జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ కొనసాగింపుగానే రామకృష్ణ కలిశారని తెలిపారు. "నాపై వ్యక్తిగతంగా విమర్శలు చేసినా..పట్టించుకోను, కానీ నిరసన వ్యక్తం చేసే వారిపై దాడులు చేయడం సరికాదని పవన్ కళ్యాణ్ చెప్పారు.

రౌండ్ టేబుల్ సమావేశానికి హజరౌతానో లేదో చెప్పలేను
మార్చి 1వ, తేదిన గుంటూరులో జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి తాను హజరౌతానో లేదో చెప్పలేనని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు.విద్యుత్ కార్మికులు, అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నానన్నారు. మార్చి 1న గుంటూరులో జరిగే రౌండ్‌టేబుల్ సమావేశానికి హాజరవుతానో లేదో రెండ్రోజుల్లో చెబుతానని వెల్లడించారు. ఆ రోజున ఇతర కార్యక్రమాలు ఉన్నందున అక్కడి నిర్వాహకులను ఒప్పించాల్సిన అవసరం ఉందని పవన్ తెలిపారు.

ఏపీకి న్యాయం చేయాలని కోరుతున్నాం
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కె.రామకృష్ణ చెప్పారు.కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాబట్టే న్యాయం చేయమంటున్నామన్నారు. ప్రత్యేక హోదా అంశంపై టీవీల్లో చర్చలు జరిపేవాళ్లపై దాడులు చేయడం సరైన వైఖరి కాదన్నారు. ఎవరు దాడులు చేస్తున్నారో వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
-
'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీలో శ్రీలీల పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..? -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
అన్న మళ్లీ హిట్ కొట్టాడోచ్.. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ రివ్యూ..! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications