పవన్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి అవసరమా..!?

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి పార్టీల మధ్య కొత్త అంశాలు తెర మీద కు వస్తున్నాయి. బీజేపీ అధినాయకత్వం సైతం ఏపీ పైన ఫోకస్ చేస్తోంది. ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ద్వారా తమ లక్ష్యాలను స్పష్టం చేసేందుకు సిద్దమైంది. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వరుస ఆలయాల సందర్శన పైన రాజకీయంగా చర్చ మొదలైంది. పవన్ కు డిప్యూటీ సీఎం పదవి అవసరమా అంటూ వామపక్ష నేతలు టార్గెట్ చేస్తున్నారు.

డిప్యూటీ సీఎం పవన్ తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలను సందర్శించారు. తన కుమారుడుతో సహా ఈ ఆలయాలను దర్శించుకున్నారు. ఈ పర్యటన పైన రాజకీయంగా భిన్నాభి ప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కాగా, తాను నాలుగున్నారేళ్ల నుంచి ఈ ఆలయాల సందర్శనకు వచ్చే ప్రయత్నం చేస్తున్నానని.. తన పర్యటన పూర్తిగా వ్యక్తిగతమేనని పవన్ స్పష్టం చేసారు. కాగా, ఇప్పుడు పవన్ వరుసగా ఆలయాల సందర్శన పైన రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. తాజా గా.. ఇదే అంశం పైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేసారు.

CPI state Secretary Ramakrishna Targets DY CM Pawan over his latest Temples visit

పరిపాలన వదిలేసి గుళ్లు, గోపురాలు అంటూ తిరుగుతున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు దేవదాయ శాఖ ఇవ్వాలని రామకృష్ణ ఎద్దేవా చేసారు. ప్రశ్నించడానికి పుట్టానని చెబుతున్న పవన్‌.. కాషాయ గుడ్డలు వేసుకుని గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రశ్నించ డం, పాలించడం మానేసి తిరిగే పవన్‌ కల్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి అవసరమా అంటూ నిలదీసారు. కేబినెట్‌లో ఉన్న ఆయన ప్రశ్నించకుండా మౌన దీక్షలు, కాషాయం అంటూ తిరగడం ఏమిటని మండిపడ్డారు. ఏపీలో అనాదిగా వస్తున్న చట్టాలను అధిగమించి గిరిజన ప్రాంతాల్లో అదానీ హైడ్రో ఎలక్ట్రికల్‌ ప్రాజెక్టులకు 2022లో ఏకంగా 2,500 ఎకరాలను కేటాయించారని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+