'పవన్ కళ్యాణ్, వైయస్ జగన్ ఎవరు చేసినా ఓకే, మద్దతిస్తాం'
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరు పాదయాత్ర చేసినా తాము స్వాగతిస్తామని సిపిఎం నేత మధు గురువారం తెలిపారు.ప్రజా సమస్యలపై ఎవరు పోరాడినా తాము మద్దతు పలుకుతామని
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరు పాదయాత్ర చేసినా తాము స్వాగతిస్తామని సిపిఎం నేత మధు గురువారం తెలిపారు.
ప్రజా సమస్యలపై ఎవరు పోరాడినా తాము మద్దతు పలుకుతామని చెప్పారు. ఏపీలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గరకపర్రులో అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ ర్యాలీ చేపట్టిన ఆందోళనకారులపై లాఠీచార్జ్ సిగ్గుచేటు అన్నారు. గరకపర్రులో సోషల్ బాయ్‌కాట్‌ను వెంటనే ఎత్తివేయాలన్నారు.
చిత్తూరులో జరిగి ఉత్సవాల్లో దళితులను పాల్గొననీయకపోవడం దారుణం అన్నారు. అక్వా చెరువుల విస్తరణలో దళితులకు పని లేకుండా పోయిందన్నారు. దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని అందరూ ఖండించాలన్నారు.












Click it and Unblock the Notifications