అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఛ‌లో అసెంబ్లీ ఉద్రిక్తం : సీపీఎస్ ర‌ద్దు కోరుతూ ఉద్యోగుల ఆందోళ‌న : అరెస్ట్..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

సీపీఎస్ ర‌ద్దు కోరుతూ ఉద్యోగుల ఆందోళ‌న, అరెస్ట్!!

కాంట్రీబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీం ను నిర‌సిస్తూ ఉద్యోగులు చేప‌ట్టిన ఛ‌లో అసెంబ్లీ ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసింది. రాష్ట్ర వ్యాప్తం గా సీపియ‌స్ ఉద్యోగులు ఎంతో కాలంగా త‌మ డిమాండ్ల సాధ‌న కోసం ఆందోళ‌న సాగిస్తున్నారు. ప్ర‌భుత్వం ఈ అంశం పై అధ్య‌య‌నానికి మాజీ సీయ‌స్ నేతృత్వంలో క‌మిటీ ఏర్పాటు చేసింది. ఉద్యోగుల‌ను పోలీసులు అరెస్ట్ చేసారు.

పెద్ద ఎత్తున వ‌చ్చిన ఉద్యోగులు
రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రీబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీం ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ ఉద్యోగులు అందోళ‌న తీవ్ర తరం చేసారు. త‌మ ఆందోళ‌న లో భాగంగా ఛ‌లో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. దీని కోసం అనేక జిల్లాల నుండి సీపియ‌స్ ఉద్యోగులు త‌ర‌లి వ చ్చారు. వీరంతా విజ‌య‌వాడ నుండి ఉండ‌వ‌ల్లి మీదుగా అసెంబ్లీకి చేరుకొనే ప్ర‌య‌త్నం చేసారు. ఇందులో భాగంగా ప్ర‌కా శం బ్యారేజి పై పెద్ద ఎత్తున ఉద్యోగులు బైఠాయించి ఆందోళన నిర్వహిస్తున్నారు. దీంతో బ్యారేజీపై గంటపాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఆందోళనను అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులకు, ఉద్యోగులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పలువురు ఉద్యోగులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉద్యోగులను చర్చకు పిలవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అక్రమ అరెస్టులు సరికాదని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. ఈ ఆందోళనలో భారీ సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

CPS Employees Chalo Assembly : Polilce Arrest..

ఆ క‌మిటీ ఏమి చేసింది..
సీపీయ‌స్ ఉద్యోగుల స‌మ‌స్య‌ల పై అధ్య‌య‌నానికి ప్ర‌భుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఆ క‌మిటీకి మాజీ సీయ‌స్ ఠ‌క్క ర్ ను ఛైర్మ‌న్ నియ‌మించారు సీపీయస్ ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను అధ్య‌య‌నం చేసి..ఈ స‌మ‌స్య‌ను ఏ ర‌కంగా ప‌రిష్క‌రిం చు కోవాలో సూచ‌న‌లు చేసేందుకు ఈ క‌మిటీ ఏర్పాటైంది. అయితే, ఈ క‌మిటీ ఇప్ప‌టి వ‌ర‌కు ఉద్యోగ సంఘాల‌తో కానీ, ఏ ఒ క్క సంఘంతో కానీ చ‌ర్చ‌లు జ‌ర‌ప‌లేద‌ని..అస‌లు ఆ క‌మిటీ ఏమైంద‌ని సీపీయ‌స్ ఉద్యోగ సంఘాలు ప్ర‌శ్నిస్తున్నా యి. త‌మ స‌మస్య‌ల పై ప్ర‌భుత్వం ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇప్ప‌టికే సీపీయ‌స్ ఉద్యోగ సంఘాలు నేత‌లు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ను..వైసిపి అధినేత జ‌గ‌న్ ను క‌లిసారు. వారిద్ద‌రూ స‌మ‌స్య‌ల ప‌రి ష్కారానికి హామీ ఇచ్చారు. ఇక‌, అసెంబ్లీ సమావేశాలు జ‌రుగుతున్న ఈ స‌మ‌యంలో సీపీయ‌స్ ఉద్యోగులు చేప‌ట్టిన ఆందోళ‌న పై ప్ర‌భుత్వం ఏ ర‌కంగా స్పందిస్తుందో చూడాలి.

English summary
CPS Employees Chalo Asssembly created tension on Prakasam Barriage. AP govt appoint a committee for resolve this issue with discussions of CPS employees leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X