అమరావతి నిర్మాణంలో కీలక మలుపు - రూ 49 వేల కోట్లు..!!

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక అడుగు పడింది. అమరావతి పరిధిలో చేపట్టే దాదాపు రూ 49 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలవాలని సీఆర్డీఏ నిర్ణయించింది. మధ్యలో నిలిచిన నిర్మాణాలను పూర్తి చేయటంతో పాటుగా.. ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా ప్రపంచ బ్యాంకు నుంచి రూ 15 వేల కోట్ల రుణం ద్వారా చేపట్టే నిర్మాణాలను ఖరారు చేసారు. ఐకానిక్‌ భవనాలు రెండున్నరేళ్లలో పూర్తి చేయనున్నారు.

పెండింగ్ పనులకు ప్రాధాన్యత
రాజధాని అమరావతి పైన సీఆర్డీఏ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని లో నిలిచిపోయిన అన్ని పనులకు రెండు నెలల్లో టెండర్లను పిలవాలని డిసైడ్ అయ్యారు. ిదే సమావేశంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆలిండియా సర్వీసు అధికారుల భవనాల పాత టెండర్లు రద్దు చేసింది. రూ.50 వేల కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టు కావడంతో ప్రతి నిర్మాణానికి పర్యావరణ అనుమతి అవసరం ఉంది. దీనికోసం ప్రత్యేకంగా ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ సోషల్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ఆమోదించారు. సిఆర్‌డిఏ ప్రాజెక్టు ఆఫీసు పూర్తికి ఎల్‌వన్‌గా నిలిచిన కెసిపి సంస్థకు పనులు కేటాయించాలని డిసైడ్ అయ్యారు.

CRDA decided to begin construction works in Amaravati in next two months

రిజర్వాయర్ల విస్తరణ
ఈ సమావేశంలో అమరావతిలో ట్రంక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధి గురించి చర్చించారు. అందులో భాగంగా 34 రోడ్లు, మురుగునీటి కాలువలు, నీటి సరఫరా నెట్‌వర్కు, పవర్‌ సదుపాయాలు, వరద నివారణ పనుల గురించి అధికారులు వివరించారు. పాలవాగు, కొండవీటివాగు కాలువ నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. శాఖమూరు, నీరుకొండ, కృష్ణాయపాలెంలో రిజర్వాయర్ల విస్తరణ పనులకు ఆమోద ముద్ర వేసారు. వరద నీటి నిర్వహణ కోసం ప్రస్తుతం ఉండవల్లి వద్ద ఉన్న లిఫ్టును పెంచాలని, వైకుంఠపురం వద్ద రెండో లిఫ్టు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నిలిచిపోయిన పనుల పరిస్థితిని అంచనా వేసేందుకు టెక్నికల్‌ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

CRDA decided to begin construction works in Amaravati in next two months

టెండర్ల ప్రక్రియ
రాజధానిలో అసెంబ్లీ, సచివాలయ నిర్మాణ పనులకు అవసరమైన టెండర్లను డిసెంబర్ చివరి వారం లేదా జనవరి తొలి వారంలో పిలవాలని నిర్ణయం తీసుకున్నారు. ఐకానిక్ భవనాలు రెండన్నారేళ్ల కాలంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. భూములు ఇచ్చిన రైతులకు పది రోజుల్లో ప్లాట్లు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కరకట్ట రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించాలని నిర్ణయించారు. దీని పైన ప్రస్తుతం అధ్యయనం కొనసాగుతోంది. కొత్తగా 200 ఎకరాలు లాండ్ పూలింగ్ లో సమకూరింది. కాగా, భూములు ఇవ్వని వారి భూములకు సేకరణ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. తాజాగా జాతీయ రహదారి నిర్మాణంలో చోటు చేసుకున్న మార్పులతో రింగ్ రోడ్డు నిర్మాణంలో ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+