అమరావతి భూ కుంభకోణంపై సీఐడీ దూకుడు: సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ మాధురి అరెస్ట్
అమరావతి: రాజధాని అమరావతిలో భూ కుంభకోణంపై సీఐడీ కీలక ముందడుగు వేసింది. ఏపీ సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ మాధురిని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అరెస్ట్ చేసింది. విజయవాడలోని తన నివాసంలో ఆమెను అదుపులోకి తీసుకుని, అనంతరం రిమాండ్‌కు తరలించారు.
2016లో రాజధాని ప్రాంతంలో గోపాలకృష్న అనే వ్యక్తికి చెందిన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు మాధురిపై ఆరోపణలున్నాయి. ఆ వ్యక్తిని నెల రోజుల క్రితమే సిట్ బృందం అదుపులోకి తీసుకుంది.

కాగా, ప్రస్తుతం రాయపూడి డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మాధురి 3 ఎకరాల 20 సెంట్ల భూ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమె ప్రభుత్వానికి రూ. 6 కోట్లు నష్టం కలిగించినట్లు సిట్ అధికారులు తెలిపారు. మాధురిని సిట్ అధికారులు మంగళగిరి కోర్టులో హాజరుపర్చారు. కాగా, మాధురికి న్యాయమూర్తి మే 12 వరకు రిమాండ్ విధించారు.
Recommended Video
కాగా, టీడీపీ హయాంలో మాధురి నెక్కల్, అనంతవరం, రాయకల్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. ఇదే కేసులో టీడీపీ నేత రావెల గోపాలకృష్ణను నెల రోజుల క్రితమే సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. రావెల గోపాల కృష్ణకు డిప్యూటీ కలెక్టర్ మాధురి అక్రమంగా భూములు రిజిస్ట్రేషన్ చేసినట్లు సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. మాధురి గతంలో నెక్కల్, అనంతవరం, రాయకల్ లో డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వర్తించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications