అమరావతి నిర్మాణానికి విరాళాల సేకరణ, ఎందుకిలా..!!

రాజధాని అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. అమరావతిలో నిర్మాణాలు తిరిగి మొదలయ్యాయి. మూడేళ్ల కాలంలో తొలి విడత నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. రెండో విడత భూ సమీకరణ పైన ఇంకా చర్చలు సాగుతున్నాయి. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం మరో ఆసక్తి కర నిర్ణయం తీసుకుంది. ప్రజల నుంచి నేరుగా విరాళాల సేకరణకు నిర్ణయించింది. కేంద్రం.. ప్రపంచ బ్యాంకుతో పాటుగా ఇతర ఆర్దిక సంస్థల నుంచి నిధులు వస్తున్న సమయంలో.. విరాళాల సేకరణ అంశం పైన చర్చ మొదలైంది.

అమరావతి నిర్మాణం కోసం ప్రజలను భాగస్వాములను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రజల నుంచి విరాళాలు స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. రాజధానికి ఆర్థికంగా సాయం చేయాలనుకునే వారు సీఆర్డీఏ వెబ్‌సైట్‌ crda.ap.gov.in లో ఇందుకు ప్రత్యేకంగా 'డొనేట్‌ ఫర్‌ అమరావతి' అనే ఆప్షన్‌ ఇచ్చింది. దీనిపై క్లిక్‌ చేస్తే క్యూఆర్‌ కోడ్‌ కనిపిస్తుంది. ఈ కోడ్‌ను స్కాన్‌ చేసి రాజధాని నిర్మాణానికి మీకు వీలైనంత నగదు విరాళంగా అందజేయవచ్చు.

CRDA invites donations for Amaravati Construction issues guidelines

మీరు డొనేట్ చేసిన డబ్బులు మొత్తం ఏపీ సీఆర్డీఏ అకౌంట్​కు జమవుతుంది. ఇదే విధంగా 2015లో అక్టోబరులో నూతన రాజధాని నిర్మాణం కోసం అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు 'మై బ్రిక్‌, మై అమరావతి'ని ప్రారంభించారు. ఒక్కో E-ఇటుకను 10 రూపాయలు వెచ్చించి ప్రజలు కొనుగోలు చేశారు.

కాగా, ఆ సమయంలో వచ్చిన నిధులు.. వివరాల లెక్కల పైన చర్చ జరిగింది. ఆ సమయంలో పలువురు ఎన్‌ఆర్‌ఐలు ఒక్కొక్కరు 10,000 ఇటుకలను విరాళంగా ఇచ్చారు. డొనేట్​ చేసిన వ్యక్తికి సీఎం చంద్రబాబు సంతకంతో కూడిన రశీదు వెళ్లింది. తాజాగా అమరావతి కోసం క్యూఆర్​ కోడ్ ద్వారా విరాళాలను సేకరిస్తున్నారు. అయితే, ఇప్పటికే కేంద్రం ప్రమేయంతో ప్రపంచ బ్యాంకు నుంచి 15వేల కోట్ల రుణం మంజూరు అయింది.

కేంద్రం నుంచి రూ 1,400 కోట్లు విడుదలకు హామీ ఇచ్చారు. హడ్కో నుంచి రూ 11 వేల కోట్ల రుణం రానుంది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని పలుమార్లు ప్రభుత్వం చెబుతూ వచ్చింది. కాగా, ఇంతగా ఆర్దిక సాయం అందుతున్న సమయంలో రాజధాని పేరుతో విరాళాల సేకరణ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వైపు రైతులు రెండో విడత లాండ్ పూలింగ్ కు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ సమయంలో ఈ విరాళాల అంశం పైనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+