అమరావతి నడి బొడ్డున అనూహ్య నిర్ణయం..!!
రాజధాని అమరావతి పై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాజధానికి ప్రపంచ బ్యాంకు తో పాటుగా హడ్కో రుణం మంజూరు అయింది. ప్రపంచ బ్యాంకు రుణం తొలి విడత నిధులు జమ అయ్యాయి. పనుల రీ లాంఛ్ కు ప్రధాని మోదీని ఆహ్వానిస్తున్నారు. రాజధాని నడిబొడ్డున ఐకానిక్ భవన నిర్మాణాల పై తుది కసరత్తు జరుగుతోంది. 36 అంతస్తుల ఎన్‌ఆర్‌టీ ఐకాన్ భవనం నిర్మాణం పై నిర్ణయం తీసుకున్నారు. రూ 600 కోట్లతో జరిగే ఈ నిర్మాణం నుంచి 360 డిగ్రీల్లో అమరావతిని వీక్షించేలా ప్రణాళిక ఖరారు చేసారు.
36 అంతస్థుల్లో ట్విట్ టవర్స్
రాజధాని అమరావతిలో కీలక నిర్మాణం పై నిర్ణయం జరిగింది. ఎన్నార్టీ భవనం నిర్మాణం కోసం ఏపీఎన్ఆర్టీ సొసైటీ (ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ ఐకాన్ టవర్) టెండర్లు పిలిచింది. టెండరు దాఖలుకు ఈ నెల 10వ తేదీ వరకు గడువిచ్చింది. ఎన్‌ఆర్‌టీ-ఐకాన్ పేరుతో ఐదెకరాల్లో నిర్మించే భారీ భవనానికి తొలి అడుగు పడింది. పోడియంతో కలిపి 36 అంతస్తుల ఎన్‌ఆర్‌టీ ఐకాన్ భవనాన్ని 3 దశల్లో నిర్మిస్తారు. మొదటి దశలో నిర్మించే ఫౌండేషన్‌కు ఇప్పుడు టెండర్లు పిలిచారు. దాదాపు రూ.600 కోట్ల అంచనా వ్యయంతో జంట టవర్లుగా చేపడుతున్న ఈ నిర్మాణం 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.

ఎన్నార్టీ భవనం
ఈ భవనం ప్రవాసాంధ్రుల కోసం, వారి నిధులతోనే ఈ భవనం నిర్మించనున్నారు. ఇందులో నివాస ఫ్లాట్లను, కార్యాలయ ప్రాంతాన్నీ వారికే విక్రయిస్తారు. పార్కింగ్ కోసం రెండంతస్తుల సెల్లార్, దానిపై మూడంతస్తుల పోడియం ఉంటుంది. దానిపై 33 అంతస్తుల్లో భవనం నిర్మిస్తారు. రెండు టవర్లలోనూ ఒక్కోదానిలో 29 అంతస్తులు ఉంటాయి. మొదటి టవర్‌లోని 29 అంతస్తుల్లో ఒక్కో అంతస్తుకు 2 చొప్పున రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఉంటాయి. రెండో టవర్‌లో కార్యాలయాలు ఏర్పాటవుతాయి. ఇక్కడ ఏర్పాటయ్యే సంస్థల్లో వేలాది మందికి ఉపాధి కల్పించేలా చర్యలు చేపడతామని చెబుతున్నారు. రెండు టవర్లను కలుపుతూ పైన నాలుగంతస్తులు నిర్మిస్తారు.
360 డిగ్రీల్లో వీక్షించేలా
ఇక, ఈ నిర్మాణం పూర్తిగా వాణిజ్య అవసరాలకే కేటాయించాలని నిర్ణయించారు. రెండు టవర్ల మధ్యలో ఏర్పాటు చేసే గ్లోబ్ ఈ భవనానికి ప్రత్యేక ఆకర్షణగా తీర్చి దిద్దనున్నారు. అందులో కూర్చుంటే 360 డిగ్రీల్లో అమరావతి నగరం మొత్తాన్ని వీక్షించవచ్చని చెబుతున్నారు. గ్లోబ్‌లో 10 నుంచి 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెస్టారెంట్లు, కిచెన్, ఎగ్జిక్యూటివ్ డైనింగ్ హాల్, లాంజ్ వంటివి ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకంగా ఎన్‌ఆర్‌టీ క్లబ్ హౌస్ ఉంటుంది. సదస్సులు, సమావేశాల నిర్వహణకు 2 వేల సీట్ల ఆడిటోరియం, 1500 సీట్ల యాంఫీ థియేటర్ ఏర్పాటు చేస్తారు. ఇప్పటికేఐకాన్ భవనంలో ఫ్లాట్ల కొనుగోలుకు 104 మంది ప్రవాసాంధ్రులు 33 కోట్ల రూపాయల డబ్బు కూడా చెల్లించారు. దీంతో, ఇప్పుడు ఈ భవనం రాజధానిలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications