వెస్టిండీస్-భారత్ రెండో వన్డే చిచ్చు: బాలరాజు Vs గంటా

Cricket match: differences between Balaraju and Ganta
హైదరాబాద్: వన్డే మ్యాచ్ విషయంలో మంత్రులు బాలరాజు, గంటా శ్రీనివాస రావుల మధ్య విభేదాలు రాజుకున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో ఈ నెల 24వ తేదీన విశాఖపట్నంలో జరగనున్న వన్డే మ్యాచును అడ్డుకుంటామని గంటా ప్రకటించిన విషయం తెలిసిందే.

దీనిపై మరో మంత్రి బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైజాగ్ ఖ్యాతిని పెంచే రెండో వన్డే మ్యాచును అడ్డుకోవడం ఏమాత్రం సబబు కాదని అభిప్రాయపడ్డారు. మ్యాచ్‌ను ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే అది సరికాదన్నారు. మ్యాచ్‌కు ప్రభుత్వం తరఫున రక్షణ కల్పిస్తామని బాలరాజు చెప్పారు.

కాగా, సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా ఉన్న నేపథ్యంలో వెస్టిండీస్ - భారత్‌ల మధఝ్య జరిగే వన్డేను అడ్డుకుంటామని గంటా హెచ్చరించారు. సాధారణ పరిస్థితులు ఉంటే మ్యాచును అడ్డుకునే వాళ్లం కాదన్నారు. ఓట్లు, సీట్ల కోసమే తెలంగాణను ముందుకు తెచ్చారని ఆరోపించారు. ఉద్యమం సమయంలో మ్యాచ్ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు.

కేంద్రమంత్రులది తప్పు కాదు: తోట

కేంద్రమంత్రులు ఢిల్లీ పెద్దలకు సీమాంధ్ర సమస్యలు చెప్పడంలో తప్పు లేదని మంత్రి తోట నర్సింహం అన్నారు. అందరి నోట సమైక్యమే వినిపిస్తోందని చెప్పారు.

రాయల తెలంగాణ వ్యక్తిగతం: శైలజానాథ్

రాయల తెలంగాణ అని కొందరు చెబుతున్నది అది వారి వ్యక్తిగతమని మంత్రి శైలజానాథ్ అన్నారు. తమ మొదటి డిమాండ్ సమైక్యాంధ్రనే అన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదన కొత్తది కాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+