సెంచరీ హీరో నితీశ్ కుమార్ రెడ్డికి చంద్రబాబు కీలక హామీ
టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి తన తండ్రితో కలిసి గురువారం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్ట్ సెంచరీ చేసిన నితీష్ కుమార్ రెడ్డిని సీఎం చంద్రబాబు అభినందించారు. ఆస్ట్రేలియాలో 100 చేసినా మ్యాచ్ కోల్పోవడం బాధ అనిపించిందని నితీష్ కుమార్ రెడ్డి చెప్పారు.
క్రికెట్ అనేది ఒక టీం గేమ్ అందరూ రాణిస్తేనే విజయం సాధ్యం అవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. లాస్ట్ రెండు ఇన్నింగ్స్‌లో కాస్త తడబడ్డా అంతకు ముందు ఇన్నింగ్స్‌లో లైన్ చివరలో వచ్చినా దేశం కోసం రన్స్ సాధించానని నితీశ్ కుమార్ రెడ్డి తెలిపారు.

నితీశ్ కుమార్ రెడ్డికి అతి త్వరలో ఇంటి స్థలం కేటాయిస్తామని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అంతర్జాతీయ క్రీడాకారులకు అండగా ఉండి అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామన్నారు. నితీశ్ కుమార్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలన్నారు. ఈ సందర్భంగా నితీశ్ కుమార్ రెడ్డి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
నితీష్ కుమార్‌ను కలిసిన విషయాన్ని చంద్రబాబు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రపంచ వేదికపై భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన నితీష్ తెలుగు జాతికి మెరుస్తున్న స్టార్ అని అన్నారు. తన ప్రయాణంలో అతనికి మద్దతు ఇచ్చిన తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. నితీష్ మరెన్నో సెంచరీలు సాధించి రానున్న రోజుల్లో విజయాన్ని కొనసాగించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
Met with the exceptionally talented young cricketer, our very own @NKReddy07, today. Nitish is truly a shining star of the Telugu community, bringing pride to India on the global stage. I commended his parents for the support they've given him throughout his journey. Wishing him… pic.twitter.com/qEGHXvkMDw
— N Chandrababu Naidu (@ncbn) January 16, 2025
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున సభ్యులు అందరం నితీష్‌తో సీఎంను కలిశామని ఎంపీ చిన్ని వెల్లడించారు. నితీష్ ప్రతిభకు తాము ప్రకటించిన రూ. 25 లక్షల చెక్ సీఎం చంద్రబాబు చేతులమీదుగా అందించామన్నారు. ఐపీఎల్‌కు రాష్ట్రం నుంచి గతేడాది ఐదుగురు ఎంపిక అయ్యారు. వచ్చే సంవత్సరం 15 మంది ఎంపిక అయ్యేలా కృషి చేస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా తామంతా క్రీడలను ప్రోత్సహిస్తున్నామని అపెక్స్ సభ్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications