"చదువు చెబుతాను" అంటూ నమ్మించి.. మైనర్ బాలికను ఏం చేశాడంటే ..?

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకున్న ఓ గిరిజన బాలిక అనుమానాస్పద మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది. పాతపట్నం-హిరమండలం పరిధిలోని ఈ సంఘటనలో ఇంటర్ విద్యార్థిని మృతి చెందడం అనేక అనుమానాలకు తావిస్తోంది. "చదువు చెబుతాను" అంటూ నమ్మించి తీసుకెళ్లిన వ్యక్తి.. కాలయముడిగా మారి పలు మార్లు అత్యాచారం చేసి హత్య చేసేందుకు యత్నించినట్టు భావిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారగా.. బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తూ న్యాయం చేయాలని కోరుతున్నారు.

అసలేం జరిగిందంటే..

బాధిత బాలిక తల్లిదండ్రులు ఊరూరా తిరుగుతూ సర్కస్ ప్రదర్శనలు చేసి జీవనం సాగిస్తున్నారు. పేదరికం మధ్య ఒక్కతే కూతురైన బాలికను చదివించాలని వారు ఎంతో ఆశపడ్డారు. ఈ సమయంలో విజయనగరం జిల్లా ఎస్‌.కోట ప్రాంతానికి చెందిన వెంకట్రావు (వెంకటేశ్వరరావు) అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతడు కుటుంబానికి దగ్గరవుతూ ఆర్థికంగా సహాయం చేయడంతో, వారి నమ్మకం పొందాడు. అదే నమ్మకాన్ని ఉపయోగించుకుని బాలికను ఎస్‌.కోటలో చదివిస్తానని చెప్పి ఇంటర్‌లో చేర్పించాడు. హాస్టల్‌లో ఉంచి చదువు బాధ్యత తనదేనని చెప్పడంతో తల్లిదండ్రులు ఒప్పుకున్నారు.

crime-news-about-minor-girl-suspicious-death-at-srikakulam-that-rape-and-murder-rumours-goes-viral

చదువు పేరుతో తీసుకెళ్లి..

అయితే ఇటీవల పరీక్షలు పూర్తవడంతో బాలిక ఇంటికి వచ్చింది. కొద్ది రోజుల తర్వాత వెంకట్రావు ఫోన్ చేసి "ఇంగ్లీష్ నేర్పించేందుకు ప్రైవేట్ ట్యూషన్ పెట్టిస్తాను" అంటూ వెంటనే పంపించాలని ఒత్తిడి చేశాడు. తల్లిదండ్రులు బాలిక ఆరోగ్యం బాగోలేదని చెప్పినా, అతడు పట్టుబట్టి ఆదివారం స్వయంగా వచ్చి బాలికను తీసుకెళ్లాడు. ఈ సంఘటన తరువాతే కథ విషాద మలుపు తిరిగింది.

కాగా బాలికను తీసుకెళ్లిన రెండు రోజులకే వెంకట్రావు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి "బాలిక సీరియస్‌గా ఉంది" అని తెలిపాడు. కొద్ది సేపటికే మరోసారి ఫోన్ చేసి "మీ కుమార్తె చనిపోయింది... నేనే కారణం" అని చెప్పినట్టు బంధువులు ఆరోపిస్తున్నారు. ఇక అంతటితో ఆగకుండా, విషయం బయటకు చెప్పొద్దని, డబ్బు ఇస్తానని ఒత్తిడి చేసినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. అంతేకాకుండా, ఎస్‌.కోటకు రావాల్సిన అవసరం లేదని, మధ్యలోనే అంత్యక్రియలు చేయాలని ప్రయత్నించడం అనుమానాలను మరింత పెంచింది.

డీతో తల్లిదండ్రులు ఎస్‌.కోటకు బయలుదేరగా, మార్గమధ్యంలోనే వారిని ఆపి వెంటనే దహన సంస్కారాలు చేయాలని వెంకట్రావు ఒత్తిడి చేశాడు. అయితే ఆ సమయంలో బాలికలో స్వల్ప కదలికలు కనిపించడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. తక్షణమే బాలికను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. వైద్యుల ప్రకారం బాలిక శరీరంపై పలుచోట్ల గాయాలు ఉండటం, మృతికి ముందు దాడి జరిగి ఉండొచ్చని సూచిస్తోంది.

ఆసుపత్రిలో వెలుగులోకి వచ్చిన నిజాలు..

ఇక బాలికను రాగోలులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పుడు, ఆమె నోరు మరియు ముక్కు నుంచి రక్తం కారడం గమనించారు. వైద్యులు పరీక్షించగా, ఆమె మరణం ఇప్పటికే జరిగినట్టు అనుమానం వ్యక్తం చేశారు. కొన్ని నివేదికల ప్రకారం, ఆసుపత్రికి తీసుకురాగానే 24 గంటలకు పైగా మృతి జరిగి ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు. బాలిక శరీరంపై గాయాలు ఉండటం, ఘటన జరిగిన పరిస్థితులు కలిపి అత్యాచారం తర్వాత హత్య జరిగి ఉండవచ్చన్న అనుమానాలను బలపరుస్తున్నాయి. కుటుంబ సభ్యులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై హిరమండలం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డీఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో విచారణ కొనసాగుతోంది. వెంకట్రావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం పోస్టుమార్టం రిపోర్ట్ కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. ఈ కేసులో ఇంకా అనేక ప్రశ్నలు అనుత్తరంగా మిగిలిపోయాయి. బాలికను నిజంగా ఎక్కడికి తీసుకెళ్లాడు? హాస్టల్‌లో ఉంచాడా లేదా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాడా? మరణానికి ముందు ఏమి జరిగింది? ఇలాంటి అనుమానాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇదే సమయంలో, ఇదివరకు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తమ కూతురి మృతికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటన కేవలం ఒక కుటుంబాన్ని మాత్రమే కాదు, సమాజాన్ని మొత్తం కలవరపరిచింది. బాలికల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. ప్రస్తుతం ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+