అమరావతి బాండ్లపై విమర్శలు కరెక్ట్ కాదు:మంత్రినారాయణ; వైసీపీ తప్పించుకుంటోంది:ధూళిపాళ్ల

అమరావతి:అమరావతి బాండ్ల జారీపై విమర్శలు సరికాదని పురపాలక శాఖా మంత్రి నారాయణ అన్నారు. బాండ్ల జారీ వల్ల ప్రజలపై అప్పుల భారం పడదని ఆయన స్పష్టం చేశారు.

Recommended Video

    రాజధాని భూములపై క్లారిటీ ఇచ్చిన సీఆర్డీఏ....!

    అమరావతిలో పనులు శరవేగంగా సాగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. బుధవారం ఉదయం అమరావతిలో రోడ్ల నిర్మాణం పనుల పురోగతిని మంత్రి నారాయణ పరిశీలించారు. పనులు మరింత వేగంగా చేయాలని సంబంధిత అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. డిసెంబర్‌ చివరి నాటికల్లా ఇక్కడి రోడ్లపై వాహనాలు తిరిగేలా చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

    అమరావతి నిర్మాణం జరగకూడదని వైసీపీ, బీజేపీ కుట్ర చేస్తున్నాయని మంత్రి నారాయణ ఆరోపించారు. డిసెంబర్‌ 31 నాటికి హైకోర్టు నిర్మాణం పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. తొలిదశ పనుల్లో భాగమైన ప్రధాన రహదారులు, గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లోని మంత్రులు, శాసనసభ్యులు, ఉన్నతాధికారులు, గెజిటెడ్‌ అధికారులు, ఎన్జీవోలు, 4వ తరగతి ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న గృహ సముదాయాల పనులు ఇప్పటికి ఒక రూపు సంతరించుకున్నట్లు మంత్రి నారాయణ ఈ సందర్భంగా తెలిపారు.

    Criticism over Amaravathi Bonds is not correct: Minister Narayana

    వచ్చే నెల నుంచి ఎపి ప్రభుత్వం 'అమరావతి యాత్రలు'కు శ్రీకారం చుట్టునున్ననేపథ్యంలో అమరావతిలో కొన్ని కీలకమైన భవన నిర్మాణ పనులైనా ఒక కొలిక్కి తేవాలని ఎపి ప్రభుత్వం కృషిచేస్తోంది. ఆ క్రమంలో పనుల వేగం పెంచాలని, మంత్రి నారాయణ అందుకోసం మరింత శ్రద్ద కనబర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్లు తెలిసింది.

    టిడిపి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా, శరవేగంగా, ఆధునిక పద్దతుల్లో నిర్మిస్తున్న నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రపంచస్థాయి నగరం విశిష్టతల గురించి కూడా రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలని ఎపి ప్రభుత్వం భావిస్తోంది. ఆ మేరకు ప్రజలను పోలవరం వద్దకు తీసుకెళ్లి ప్రాజెక్ట్ పనుల పురోగతి చూపించే "పోలవరం యాత్రలు" తరహాలో రాష్ట్ర వాసుల కోసం ఎపి ప్రభుత్వం "అమరావతి యాత్రలు" చేపట్టనుంది. వచ్చే నెలలో ఈ కార్యక్రమానికి నాంది పలకాలని ఎపి గవర్నమెంట్ భావిస్తున్నట్లు తెలిసింది.

    Criticism over Amaravathi Bonds is not correct: Minister Narayana

    ఇదిలావుంటే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ రాకుండా తప్పించుకుంటోందని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలను వైసీపీ నేతలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సభ్యులు అడిగే ప్రతి ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెబుతుందని ఆయన స్పష్టం చేశారు. రాజశేఖర్‌ రెడ్డి హయాంలో టీడీపీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించలేదా?...అని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఈ సందర్భంగా ప్రశ్నించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+