తరిమికొడ్తారు: రావెల, కెసిఆర్ పాలనపై పల్లె ఫైర్

ప్రే ఫర్ విశాఖ, ప్రే ఫర్ సిఎం బ్రోచర్‌ను ఆయన శనివారంనాడు ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఆయన విడుదల చేశారు. ప్రజలు ఇప్పటికే కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను తిరస్కరించారని, తిరస్కరణకు గురైన నాయకులు వస్తే ప్రజలు తరిమికొడుతారని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మరో ఆంధ్రప్రదేశ్ ముంత్రి పల్లె రఘునాథ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. కెసిఆర్ దృతరాష్ట్రునివంటివారని, తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని ఆయన అన్నారు. తిరుమల శ్రీవారిని ఏపీ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో మంత్రి పల్లె స్వామివారి సేవలో పాల్గొన్నారు.
దర్శనం తర్వాత ఆలయ అధికారులు మంత్రికి తీర్థప్రసాదాలు అందజేశారు. నవ్యాంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందాలని శ్రీవారిని కోరుకున్నట్లు ఆయన ఈ సందర్బంగా తెలిపారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐటి హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు. తిరుపతి ఎస్వీయులో వృత్తి నైపుణ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగావకాశాలను ఐటి రంగంలో కల్పిస్తామని చెప్పారు. పెట్టుబడులు పెట్టడానికి ఎపి ఓ స్వర్గధామమని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సింగపూర్ పర్యటన విజయవంతమైందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతున్నారని ఆయన శనివారంనాడు రాజమండ్రిలో మీడియాతో అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలు పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉన్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications