ఏపిలో ఫలిస్తున్న కర్య్పూ ఆంక్షలు.!స్వల్పంగా తగ్గిన వైరస్ ప్రభావం.!కొత్తగా 15,284 కేసులు నమోదు.!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం స్వల్పంగా తగ్గినట్టు తెలుస్తోంది. గత మూడు వారాల నుండి అమలవుతున్న కర్య్పూ వల్ల కరోనా వైరస్ వ్యాప్తిలో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రతిరోజు 20వేలు నమోదయ్యే కరోనా కేసులు నేడు గణనీయంగా తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. ప్రజలెవ్వరూ బయటకు రాకుండా కర్య్పూ అమలు చేయడంతో పాటు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుండడంతో కరోనా నియంత్రణ సాద్యమైనట్టు తెలుస్తోంది. మాస్క్ లేకుండా తిరుగుతున్న వారికి భారీగా జరిమానాలు, అకారణంగా రోడ్డుమీదకు వచ్చిన వారి వాహనాలు సీజ్ చేయడం వంటి కఠిన నిర్ణయాల వల్ల కరోనా ఉదృతిని తగ్గించగలిగామని ప్రభుత్వ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. మరికొన్ని రోజులు ఇవే ఆంక్షలు ఇంతే కఠినంగా అమలు చేస్తే కరోనానే తరిమికొట్టొచ్చనే అబిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు ఏపి వైద్యాధికారులు.

Recommended Video
ఏపీలో కొత్తగా 15,284 కరోనా కేసులు నమోదుకాగా, 106 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు 16,09,105కి కరోనా కేసులు చేరుకోగా, 10,328 మరణాలు సంభవించాయి. ఏపీలో 1,98,023 యాక్టివ్ కేసులుండగా, 14,00,754 మంది రికవరీ అయ్యారు. కొత్తగా చిత్తూరు జిల్లాలో 15 మంది, ప్రకాశం జిల్లాలో 11, పశ్చిమగోదావరి జిల్లాలో 10 మంది మృతి చెందారు. అనంతపురం, తూర్పుగోదావరి, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో 9 మంది చొప్పున చనిపోయారు. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో 8 మంది చొప్పున మృతి చెందగా, శ్రీకాకుళం జిల్లాలో 7, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున కన్నుమూశారు. కడప జిల్లాలో కరోనాతో ఒకరు మృతి చెందారు. గత 24 గంటల్లో 20,917 మంది రికవరీ కాగా, మొత్తం 72,979 కరోనా టెస్టుల నిర్వహించారు. కరోనా కేసులు సంఖ్య తగ్గుతున్నప్పటికి మరణాల రేటు గణనీయంగా ఉందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications