• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఎపిలో బ్యాంకులు,ఎటిఎంల్లో నో కరెన్సీ...క్యాష్ కోసం జనాల కటకట

  |

  అమరావతి: ఈ బ్యాంకులకు ఏమైందీ?...మళ్లీ అలాంటి పరిస్థితి వస్తుందా?... ఎందుకిలా జరుగుతోంది?...ఇవీ ఈమధ్య కాలంలో క్యాష్ కోసం ఎటిఎంలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న జనాల మదిలో మొదులుతున్నప్రశ్నలు...

  పెద్ద మొత్తం సంగతి దేవుడెరుగు అసలు కనీస అవసరాల కోసం క్యాష్ తీద్దామన్నా...ఎక్కడా ఏటీఎంలు పనిచేయడం లేదు...పనిచేసే ఒకటి అరా దగ్గర కొండవీటి చాంతాడంత క్యూలు...పోనీ లైన్లో నుంచున్నా క్యాష్ తమ దాకా వస్తుందో లేదో గ్యారెంటీ లేదు కదా అనుకుంటూ బ్యాంకుకు వెళితే అక్కడా అదే పరిస్థితి...సరే ఎలాగోలా అని ఓర్చుకొని మన వంతు వచ్చేదాకా వెయిట్ చేస్తే...అడిగిందాంట్లో 5 వ వంతు చేతిలో పెడుతున్నారు. అదేమంటే...బ్యాంకులో క్యాష్ లేదని...ఉన్నదే అందరికీ పంచాలని క్లాసు...ఇదీ ఏపీలో నేటి పరిస్థితి...క్యాష్ కోసం తిరిగే జనాల దుస్థితి

   క్రమంగా పెరుగుతున్న...క్యాష్ కష్టాలు...

  క్రమంగా పెరుగుతున్న...క్యాష్ కష్టాలు...

  రాష్ట్రవ్యాప్తంగా గత కొంతకాలంగా బ్యాంకుల్లో,ఎటిఎంలో క్యాష్ లభ్యత గురించి చూస్తే ఖచ్చితంగా భయాందోళనలు కలక్కమానవు. కారణం మూతపడుతున్న ఎటిఎంల సంఖ్య అంతకంతకూ అధికమైపోతుండటం...బ్యాంకుల్లో సైతం కరెన్సీ లభ్యం కాకపోవడం...ఏదో జరుగుతోందన్న సందేహాన్ని ప్రజల్లో రేకెత్తిస్తోంది. లేకుంటే ఇలా ఎందుకు జరుగుతుంది అనే డౌట్ పట్టి పీడిస్తోంది...ప్రస్తుతం క్యాష్ కోసం బ్యాంకులు, ఏటీఎంల వద్ద పడిగాపులు పడుతున్నజనాలకు మొన్నటి పెద్ద నోట్ల రద్దు నాటి పరిణామాలే గుర్తుకు వస్తున్నాయి.

  ఎటిఎంలు మూత...బ్యాంకుల్లో నో క్యాష్...

  ఎటిఎంలు మూత...బ్యాంకుల్లో నో క్యాష్...

  మిగిలిన ఎటిఎంల సంగతేమో కానీ...ప్రధాన బ్యాంకు బ్రాంచ్‌ల దగ్గర ఉన్న ఏటీఎంలలో సాధారణంగా ఎప్పుడూ డబ్బు ఉంటుంది. కానీ ఇటీవలికాలంలో ఈ ఎటిఎంల్లోనూ క్యాష్ లభ్యం కాకపోవటమే జనాలకు సందేహం కలిగిస్తోంది...దీనికి తోడు పలు బ్యాంకుల ముందు నో క్యాష్‌ బోర్డులు వేలాడదీయడం సాధారణ పరిస్థితుల్లో అసాధారణంగా అనిపిస్తోంది. అనంతపురం నుంచి మొదలెత్తుకొని...శ్రీకాకుళం దాకా ఇదే పరిస్థితని ఫోన్ల ద్వారా తెలుసుకొని ఆందోళన చెందుతున్నారు...మళ్లీ ఏదో జరుగుతోందని డౌట్ పడుతున్నారు.

   చెస్ట్ ల నుంచే...క్యాష్ రావడం లేదు...

  చెస్ట్ ల నుంచే...క్యాష్ రావడం లేదు...

  ఈ పరిస్థితికి కారణం చెస్ట్ ల నుంచి బ్యాంకులకు డబ్బు రాకపోవడమేనని తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని బ్యాంకులకు చెస్ట్‌ల నుంచి నగదు పంపిణీ ఆగిపోయిందని సమాచారం. అప్పటికి సోమవారం కు అవసరమయ్యే క్యాష్ కోసం బ్యాంకులు ముందస్తుగా శుక్రవారం నాడే ఇండెంట్‌లు పెట్టాయి. శని, ఆదివారాలు సెలవు కావడం వల్లే బ్యాంకులు ఆ జాగ్రత్త తీసుకున్నాయి. అయినా ఫలితం మాత్రం లేదు...సోమవారం చెస్ట్‌ల నుంచి ఒక్క రూపాయి కూడా బ్యాంకులకు రాలేదు...చెస్ట్ అధికారులను ప్రశ్నిస్తే డబ్బు రాగానే పంపిస్తామంటున్నారని తమని అడుగుతున్న ఖాతాదారులకు బ్యాంకు అధికారులు పరిస్థితి వివరిస్తున్నారు.

   క్యాష్ రానిది...ఎందుకు?...అందుకేనా?...

  క్యాష్ రానిది...ఎందుకు?...అందుకేనా?...

  చెస్ట్ ల నుంచి బ్యాంకులకు క్యాష్ రాకపోవడానికి...చెస్ట్ ల వద్ద నగదు నిల్వలు లేకపోవడం వల్లనా?...అంటే చెస్ట్ లకే రిజర్వుబ్యాంకు నుంచి డబ్బు రావాల్సి ఉందా?...లేక చెస్ట్‌లలో ఉన్నా రిజర్వ్ బ్యాంకు ఆదేశాల మేరకే ఇవ్వకుండా ఆపుతున్నారా?...అలా అయితే మళ్లీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనేదే అటు బ్యాంకులు...ఇటు ఖాతాదారుల్లో తలెత్తుతున్న సందేహం...ప్రతిరోజూ చెస్ట్ ల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సుమారు రూ.10 నుంచి 12వేల కోట్ల రూపాయలు వరకు పంపిణీ జరుగుతుందని తెలుస్తోంది. కానీ శుక్రవారం ఇలా పంపిణీ జరగనేలేదట...

   ఈ పరిస్థితికి కారణం...ఆ బిల్లేనా?...

  ఈ పరిస్థితికి కారణం...ఆ బిల్లేనా?...

  కేంద్ర ప్రభుత్వం కొత్తగా తేబోతున్న ఎఫ్ఆర్డీఐ బిల్లు ప్రభావమా ఇదంతా...అవుననే సమాధానం వస్తోంది. బ్యాంకులు దివాళా తీస్తే మన డబ్బు తీసేసుకోవడమనే ఈ బిల్లులోని ప్రధానాంశం కారణంగానే జనాలందరూ బ్యాంకుల్లోని తమ డిపాజిట్లు విత్ డ్రా చేసేసుకుంటున్నారని, దాని ఫలితమే ఇదని అనుకుంటున్నారు...
  కాలపరిమితి తీరిన తమ డిపాజిట్లను వెంటనే క్లియర్‌ చేసుకొని, నగదును ఇంటికి తెచ్చేసుకుంటున్నారని, మళ్లీ డిపాజిట్‌ చేయడంలేదని తెలుస్తోంది. సాధారణంగా ఒక బ్యాంకు శాఖ లావాదేవీలు పరిశీలిస్తే ఆరోజు బ్యాంకుకు వచ్చిన వసూళ్లు, బ్యాంకు చేసే చెల్లింపుల కు మధ్య తేడాను చెస్ట్‌నుంచి తెచ్చుకుంటుంది. అయితే ఇప్పుడు డిపాజిట్లు తగ్గిపోవడంతో వచ్చేది తగ్గిపోయింది. అదే సమయంలో ఖాతాదారులు తీసుకునేదేమో పెరిగిపోయింది....అయితే దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందా...ఆంధ్రాకు కాస్త ఎక్కువ సమస్య ఉందా...అలాగైతే దీని వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా? అని కూడా కొందరు ఖాతాదారులు చర్చించుకుంటున్నారు.

  చేయని తప్పుకు...బ్యాంకులపై తీవ్ర ఒత్తిడి...

  చేయని తప్పుకు...బ్యాంకులపై తీవ్ర ఒత్తిడి...

  దీంతో సాధారణజనాలు నగదు లభ్యం కాకపోవడంలో బ్యాంకుల తప్పేమీ లేదన్న విషయం తెలియక ప్రతిచోట బ్యాంకు వారితో వాగ్వాదానికి దిగుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లోనూ తమ డబ్బు తమకు ఇవ్వడం లేదంటూ దూషణలకు దిగుతున్నారు. దీంతో తమ పరిస్థితి ఘోరంగా తయారైందని బ్యాంకు ఉద్యోగులు వాపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళనతో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. మరి...ఈ పరిస్థితి దిద్దుబాబుకు ఆర్ బిఐ చర్యలు చేపడుతుందా?...చేపడితే ఎప్పుటికి పరిస్థితి చక్కబడుతుంది...అసలు చక్కబడుతుందా?...అన్నింటికి కాలమే సమాధానం చెబుతుంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Amaravathi: ATM card holders are facing lot of problems due to non-availability of cash in the ATMs, Banks in the state, due to shortage of cash supply by the Chests. When the farmers sell paddy, rice millers will transfer amount to their Savings Bank account. When they are drawing cash, banks are paying cash in equal installments in the rural branches due to shortage of cash.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more