అదే ఫైనల్, అతీతుడేంకాదు: కిరణ్‌కు దిగ్విజయ్ ఝలక్
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ ఆదివారం ఝలక్ ఇచ్చారు. ఆయన న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ విభజనపై సిడబ్ల్యూసి నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు.
ముఖ్యమంత్రి కిరణ్ కరడుగట్టిన కాంగ్రెసువాది అని విభజన పైన ఆయనకు అభ్యంతరాలు ఉంటే ఉండవచ్చునని వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెసు పార్టీకి సిడబ్ల్యూసి నిర్ణయమే అంతిమం అన్నారు. ఆ నిర్ణయానికి కిరణ్ ఏమీ అతీతులు కాదని అభిప్రాయపడ్డారు.

రెండు రోజుల క్రితం దిగ్విజయ్ ఢిల్లీలో మాట్లాడుతూ.. విభజన విషయంలో ముఖ్యమంత్రి కన్విన్స్ అయ్యారని చెప్పిన విషయం తెలిసిందే. దానికి శనివారం కిరణ్ స్పందించారు. తాను కన్విన్స్ కాలేదని, సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నానని చెప్పారు. దీనిపై డిగ్గీ ఈ రోజు స్పందించారు. తద్వారా కిరణ్ వ్యాఖ్యలపై ఆయన డోంట్ కేర్ అన్న విధంగా మాట్లాడారు.
తీర్మానం రావాలి: యనమల
అసెంబ్లీకి తెలంగాణ తీర్మానం రావాల్సిందేనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాసన మండలి పక్ష నేత యనమల రామకృష్ణుడు ఆదివారం హైదరాబాదులో అ్నారు. తీర్మానం రాకుండా కేంద్రం ప్రయత్నాలు చేస్తోందన్నారు. భద్రాచలం పైన స్థానికుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications