హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వీడు మహా ఘటికుడు, రోమాంటిక్ థాట్స్: అమ్మాయిలకు అశ్లీల వీడియోల షేరింగ్

ఎస్సై శోభన్‌బాబు వెంటనే సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ చాంద్‌బాష, ఎస్సై జనార్దన్‌లు నందమూరు వెళ్లి నిందితుడిని హైదరాబాద్‌ తీసుకువచ్చి జైలుకు తరలించారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: అశ్లీలమూ అసభ్యమూ అయిన వీడియోలను యువతులకు పంపించి వేధిస్తున్న సైబర్‌నేరగాడు ఉప్పులూరి మణిరత్నంను హైదరాబాద్ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ట్రూకాలర్‌ పరిజ్ఞానంతో మహిళల ఫోన్‌ నెంబర్లను వాట్సప్‌ బృందంగా చేర్చి అందరికీ అసభ్యచిత్రాలు, వీడియోలు పంపుతూ వస్తున్నాడు. అంతేకాదు, ఏకంగా 'షి'బృందంలో పనిచేస్తున్న ఎస్సై శోభన్‌బాబునే బెదిరించాడు.

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా నందమూరు గ్రామానికి వెళ్లి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పీడీచట్టం ప్రయోగించామని, రౌడీషీట్‌ తెరిచామని ఏసీపీ సైబర్‌క్రైమ్‌ రఘువీర్‌ తెలిపారు.

Cyber Crime accused arrested by Hyderabad police

పదోతరగతి చదివిన ఉప్పులూరి మణిరత్నం(23) నందమూరులో పొలం పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే, యువతుల నెంబర్లను రొమాంటిక్‌ థాట్స్‌ షేరింగ్‌ గ్రూప్‌గా ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటినుంచి వాట్సాప్‌ గ్రూప్‌లోని 200కిపైగా నెంబర్లకు గంటకోసారి అసభ్యచిత్రాలు, నగ్నదృశ్యాలు, వీడియోలు పంపిస్తున్నాడు.

దీనిపై కొద్దిరోజుల కిందట ఓయువతి 'హాక్‌ఐ' మొబైల్‌ యాప్‌ ద్వారా హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును 'షి'బృందం ఎస్సై శోభన్‌బాబుకు దర్యాప్తు అప్పగించారు. మణిశర్మ నెంబర్‌ (84668 88721)కు ఎస్సై ఫోన్‌చేస్తే ఆయననూ బెదిరించాడు.

ఎస్సై శోభన్‌బాబు వెంటనే సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ చాంద్‌బాష, ఎస్సై జనార్దన్‌లు నందమూరు వెళ్లి నిందితుడిని హైదరాబాద్‌ తీసుకువచ్చి జైలుకు తరలించారు.

ఇలా చేశాడు...

ఆన్‌లైన్‌లో వివాహితలు, యువతులు, విద్యార్థినులతో పరిచయాలు పెంచుకొని వందల సంఖ్యలో వారి ఫోన్‌ నంబర్లను సేకరించాడు. స్నేహం పేరుతో మాటలు కలిపి.. వారితో ''రొమాంటిక్‌ థాట్స్‌ షేరింగ్‌'' పేరుతో ఓ వాట్సప్‌ గూరప్‌ తయారు చేశాడు.అరు నెలలుగా అశ్లీల ఫొటోలు, అసభ్యకరమైన మెసేజ్‌లు షేర్‌ చేస్తూ వస్తున్నాడు.

అతనికి తల్లి చిన్నప్పుడే దూరమైంది. తండ్రి పొలం పనులు చేస్తుంటాడు. మణిరత్నం ఏడు నెలల క్రితం ఓ స్మార్ట్‌ఫోన్‌ కొన్నాడు. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌, గూగుల్‌ ప్లస్‌ తదితర సోషల్‌మీడియాల్లో యువతులు, గృహిణులకు ఫ్రెండ్‌షిప్‌ రిక్వెస్ట్‌ పంపేవాడు. అవతలి వైపు నుంచి ఓకే రాగానే చాటింగ్‌ ప్రారంభించేవాడు. చాకచక్యంగా మాటలు కలిపి మెల్లగా వారి వ్యక్తిగత వివరాలు, ఫోన్‌నంబర్లు సంపాదించేవాడు.

ట్రూ కాలర్‌ సహకారంతో కూడా మహిళల నంబర్లను సేకరించేవాడు. ఆరు నెలల వ్యవధిలో మూడు వందల మంది మహిళల నంబర్లు సేకరించాడు. వారితో '' రొమాంటిక్‌ థాట్స్‌ షేరింగ్‌'' వాట్సప్‌ గ్రూపును తయారు చేశాడు. ఆ గ్రూప్‌లో అసభ్యకర మెసేజ్‌లు, అశ్లీల దృశ్యాలను పోస్ట్‌ చేసేవాడు. శృంగారపరమైన అంశాలతో చాటింగ్‌ జరిపేవాడు.

మూడు నెలలుగా అతడి నుంచి అసభ్యకరమైన మెసేజ్‌లు వస్తుండటంతో హైదరాబాదు నగరానికి చెందిన ఓ మహిళ ధైర్యం చేసి హాక్‌ఐ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. టవర్‌ లొకేషన్‌ ఆధారంగా పోలీసులు పశ్చిమగోదావరి జిల్లా వెళ్లి నిందితుడు మణిరత్నంను అరెస్ట్‌ చేశారు. అతడి వద్ద నుంచి మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 300 మందికి పైగా మహిళల ఫోన్‌ నంబర్లు, నగ్న చిత్రాలున్నట్లు గుర్తించారు.

English summary
Cyber crime accused Uppuluri Maniratnam has been arrested by Hyderabad cyber crime police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X