హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నెట్‌లో అశ్లీల చిత్రాలతో మహిళా సహోద్యోగుల ఫోటోలు: అరెస్టు (ఫొటో)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి తన ఇద్దరు మహిళా సహోద్యోగుల చిత్రాలను అశ్లీల చిత్రాలతో జోడించి ఇంటర్నెట్‌లో పెట్టిన హైదరాబాదులోని ఐడిఎ నాచారం ఎపి ఫుడ్స్ ఉద్యోగి కమల్ల రవి కుమార్ (44)ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. రవి కుమార్ నల్లగొండ జిల్లా బీబీనగర్‌కు చెందినవాడు.

ఐడిఎ నాచారం ఎపి ఫుడ్స్‌లో పనిచేస్తున్న ఇద్దరు మహిళా ఉద్యోగులు ఈ ఏడాది సెప్టెంబర్ 19వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఎవరో రెండు నకిలీ ప్రఫైల్స్‌ను ఫేస్‌బుక్‌లో క్రియేట్ చేసి, అశ్లీస చిత్రాలతో పాటు తమ చిత్రాలను పోస్టు చేశారని తమ దృష్టికి వచ్చిందిని వారు ఫిర్యాదు చేశారు. యాడ్ రిక్వెస్ట్ కూడా పెట్టారని వారు చెప్పారు.

Cyber Crime Police of Cyberabad arrested Kamalla Ravi Kumar

సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగించారు. అదే కంపెనీలోని అకౌంట్స్ సెక్షన్‌లో ట్రేడ్స్‌మ్యాన్ -ఎగా పనిచేస్తున్న రవి కుమార్ ఆ ఇద్దరు మహిళలు హెల్త్ కార్డుల కోసం సమర్పించిన స్కాన్డ్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను ఉపయోగించి నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేశాడని గుర్తించారు. కంపెనీ కార్మికుల సంఘంలో వారి చురుకైన పాత్రను భరించలేక ఆ పనిచేశాడని అంటున్ారు. రవి కుమార్‌ను పోలీసులు శనివారంనాడు అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు.

కేసును సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పిఎస్ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ ఎస్ జయరాం దర్యాప్తు చేశారు. సబ్ ఇన్‌స్పెక్టర్ డి ఆశిష్ రెడ్డి సహకారం అందించారు. కేసు దర్యాప్తు అదనపు డిసిపి బి శ్రీనివాస రెడ్డి పర్యవేక్షణలో జరిగింది. కేసు దర్యాప్తు చేసి, నిందితుడిని అరెస్టు చేసిన పోలీసు అధికారులను సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ అభినందించారు.

English summary
Cyber Crime Police of Cyberabad arrested Kamalla Ravi Kumar (44) r/o. Bibinagar, Nalgonda; an employee of M/s. AP Foods, IDA Nacharam, for harassing his two woman colleagues by creating fake profiles on Facebook and uploading their pictures along with some obscene pictures obtained from internet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X