Cyclone Arnab:తుపాను అర్నబ్​ అల్లకల్లోలం, భారీ వర్షాలు - ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్...!!

అతి తీవ్ర తుపాను అర్నబ్​ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రస్తుతం తుపాను పూర్తి స్థాయిలో దాటింది. తీర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు కురుస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమైంది. పలు ప్రాంతాల్లో రహదారులు దెబ్బ తిన్నాయి. కాగా.. పలు జిల్లా లకు రెడ్ అలర్ట్ జారీ అయింది. రానున్న నాలుగు గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగటం పైన వాతావరణ శాఖ తాజా అలర్ట్స్ జారీ చేసింది.

ఆర్నాబ్ తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. కోనసీమ జిల్లా వణికిపోయింది. తుఫాను తీరం దాటిన వేళ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలకు తాజాగా రెడ్ అలర్ట్ జారీ అయింది. బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, తూ.గో., ప.గో., కాకినాడ, కోనసీమ, అల్లూరి, అనకాపల్లి, విశాఖ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయిన జిల్లాల్లో ఉన్నాయి. కాగా.. పల్నాడు, గుంటూరు, విజయ నగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లాలకు 'ఆరెంజ్' అలర్ట్ జారీ చేసారు.

arnab-cyclone-crosses-coast-heavy-rains-continue-red-alert-issued-for-six-districts

పలు జిల్లాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇవాళ భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ అల్లూరి, అనకాపల్లి, విశాఖ, శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలకు ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది.

 మున్సిపల్ ఎన్నికలపై ఆర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్, కీలక నిర్ణయం..!!
మున్సిపల్ ఎన్నికలపై ఆర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్, కీలక నిర్ణయం..!!

అర్నబ్‌ తుపాను దెబ్బకు కోనసీమ భారీగా దెబ్బ తింది. ఈదురుగాలుల ధాటికి కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలో చింతనలంకలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలోని ధ్వజస్తంభం నేలకొరిగింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లు, అచంట నియోజకవర్గాల్లో భారీ ఈదురుగాలులు వీస్తున్నాయి. పలుచోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గోదావరి జిల్లాలు భారీ వర్షాలకు చిగురుటాకులా వణికాయి.

భారీ ఈదురుగాలుల ధాటికి పలు చోట్లు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నెలకొరిగాయి. ఇళ్లలోకి నీరు చేరి జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికార యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ సాయంత్రం వరకు తుఫాను ప్రభావం కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+