వందే భారత్ రద్దు-విశాఖ-ముంబై-LTT ఎక్స్ ప్రెస్ మళ్లింపు-ఈ రైళ్ల ఆలస్యం..!

అర్నబ్ తుఫాన్ (Cyclone Arnab) ప్రభావం రైల్వే శాఖపైనా తీవ్రంగా ఉంది. ముఖ్యంగా నిన్న రాత్రి తీరం దాటిన అర్నబ్ తుఫాన్ ప్రభావం కోస్తా జిల్లాలపై ఇంకా పడుతున్న నేపథ్యంలో ఇవాళ కూడా పలు రైళ్లు రద్దవుతున్నాయి, అలాగే మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇంకొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు అత్యంత అలర్ట్ గా ఉంటూ, ఎప్పటికప్పుడు రైల్వేశాఖ ఇచ్చే అప్డేట్స్ ఫాలో కావాల్సి ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు.

ఏబీ ఎంట్రీతో మారిపోయిన బెజవాడ మేయర్ లెక్కలు-ఆ ఇద్దరికీ కష్టాలేనా?
ఏబీ ఎంట్రీతో మారిపోయిన బెజవాడ మేయర్ లెక్కలు-ఆ ఇద్దరికీ కష్టాలేనా?

అర్నబ్ తుఫాన్ కారణంగా ఇవాళ రద్దయిన రైళ్లలో రైలు నంబర్ 20834 సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ ప్రెస్, రైలు నంబర్ 06020 నరసాపురం-ట్యుటికోరిన్ ఎక్స్ ప్రెస్, రైలు నంబర్ 17291 నరసాపురం-తిరువణ్ణామలై ఎక్స్ ప్రెస్ ఉన్నాయి. వీటిని ఇవాళ ఒక్క రోజు పాటు రద్దు చేశారు. అలాగే ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు కూడా ప్రకటించారు. రైలు నంబర్ 12842 చెన్నై సెంట్రల్-హౌరా రైలు రెండు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. రైలు నంబర్ 7228 గుంటూరు-డోన్ రైలు కూడా గంటన్నర ఆలస్యంగా నడుస్తోంది.

Cyclone Arnab Vande Bharat Cancelled Visakhapatnam Mumbai LTT Train Diverted Check Affected Trains
అర్ణబ్ తుఫాన్ పై రైతులకు ఏపీ సర్కార్ కీలక సూచనలు..! ఇలా చేస్తే సేఫ్..!
అర్ణబ్ తుఫాన్ పై రైతులకు ఏపీ సర్కార్ కీలక సూచనలు..! ఇలా చేస్తే సేఫ్..!

రైలు నంబర్ 22816 ఎర్నాకుళం-బిలాస్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలు మూడు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. రైలు నంబర్ 12864 బెంగళూరు-హౌరా ఎక్స్ ప్రెస్ కూడా గంట ఆలస్యంగా నడుస్తోంది. రైలు నంబర్ 22159 ముంబై-చెన్నై సెంట్రల్ ఎక్స్ ప్రెస్ కూడా గంటా 45 నిమిషాల ఆలస్యంగా నడుస్తోంది. ఇక దారి మళ్లించిన రైళ్లలో విశాఖ నుంచి ముంబై ఎల్టీటీ ఎక్స్ ప్రెస్ రైలు ఉంది. ఈ రైలును విశాఖ నుంచి దువ్వాడ-ఏలూరు-విజయవాడ వైపుగా నడుపుతున్నారు. దీని కారణంగా ఈ రైలు రెగ్యులర్ రూటులో ఉన్న తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ స్టేషన్లలో ఆగే అవకాశం లేదు. వీటితో పాటు నిన్న ప్రకటించిన రైళ్లు కూడా ఇావాళ రద్దు కావడం, ఆలస్యంగా నడవటం లేదా దారి మళ్లింపులు ఉన్నాయి. కాబట్టి ప్రయాణికులు ఆయా రైలు తాజా స్టేటస్ ను ఎప్పటికప్పుడు తెలుసుకుని ప్రయాణించడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+