హెలెన్: తుఫానుగా మారిన వాయుగుండం

Cyclone Helen to cross Andhra Pradesh tomorrow
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ తుఫానుగా మారింది. దీనికి హెలెన్ అని పేరు పెట్టారు. ప్రస్తుతం హెలెన్ తుఫాను విశాఖపట్నానికి 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. బుధవారం సాయంత్రానికి ఇది తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు ఆ విషయాలు చెప్పారు.

తుఫాను ప్రభావం వల్ల బుధవారం రాత్రి నుంచి వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని, గురువారం రాత్రి ఒంగోలు - చెన్నై మధ్య తీరం దాటే అవకాశం ఉంది. హెలెన్ తుఫాన్ నెల్లూరు జిల్లా కావలి వద్ద గురువారం రాత్రి ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా తీరాన్ని దాటుతుందని ఐఎండి చెప్పింది.

మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తుఫాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ గాలులు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో కూడా వీయవచ్చునని చెప్పారు.

హెలెన్ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు, పాండిచ్చేరి తీర ప్రాంతాల్లో ఉంటుంది. తుఫాను తీరం దాటే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి తీవ్రంగా ఉంటుందని అన్నారు. తుఫాను దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+