ఏపీ, తమిళనాడును వణికిస్తున్న మాండూస్ తుపాను: కోస్తా, సీమ జిల్లాల్లో భారీ వర్షాలు
చెన్నై/అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తీవ్ర తుఫానుగా మారింది. తీరం దిశగా ఇది దూసుకొస్తోంది. ఈ అర్ధరాత్రి లేదా శనివారం తెల్లవారుజామున ఈ తుపాను ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ, తమిళనాడులోని చెన్నై సహా పలు ప్రాంతాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి.
తుపానుగా మారిన వాయుగుండం ప్రస్తుతానికి జఫ్నా(శ్రీలంక) తూర్పు ఆగ్నేయంగా 280 కిలోమీటర్లు, మహాబలిపురానికి 90 కిలోమీటర్లు, చెన్నైకు 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాములోపు పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందన్నారు.

తీరం దాటే సమయంలో 65-85 కిలోమీటర్లు వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ఆయన వెల్లడించారు. దీని ప్రభావంతో శనివారం దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో, రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు.
సముద్రం అలజడిగా ఉంటుందని శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. తుపాను తీరం దాటినప్పటికీ శని, ఆదివారాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను కదలికలను స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రభావం చూపే జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేస్తున్నామన్నారు. సహాయక చర్యల కోసం ప్రకాశంలో 2, నెల్లూరులో 3, తిరుపతిలో 2, చిత్తూరులో 2 మొత్తం 5ఎన్డీఆర్ఎఫ్, 4ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పంపించామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భయపడాల్సిన అవసరం లేదన్నారు.
#WATCH | Heavy rains with strong winds in Pattinapakkam area of Chennai as landfall process of cyclone #Mandous begins. pic.twitter.com/tVFN7nbPYH
— ANI (@ANI) December 9, 2022
మాండోస్ తుఫాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్ఛేరి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక దక్షిణకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చు. శనివారం కూడా తమిళనాడు, రాయలసీయ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. అలలు ఎగసిపడతాయి. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఆదేశాలు జారీ చేసింది. నెల్లూరు జిల్లాలో చలిగాలులు వీస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. తమిళనాడులో 12 జిల్లాలకు అలర్ట్ ప్రకటించారు. చెన్నై విమానాశ్రయంలో పలు విమానాలను రద్దు చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యాలయాలకు సెలవులు ప్రకటించారు.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications