మచిలీపట్నం వద్ద తీరాన్ని తాకనున్న సూపర్ సైక్లోన్ ..!!

Cyclone Michaung: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. మరింత బలపడింది. అండమాన్ నికోబార్ ద్వీప సముదాయాల గగనతలంపై కేంద్రీకృతమైన ఈ వాయుగుండం క్రమంగా వచ్చే 24 గంటల వ్యవధిలో తుఫాన్‌గా మారుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 2 లేదా 3వ తేదీ నాటికి తుఫాన్‌గా ఆవిర్భవిస్తుందని అంచనా వేసింది.

క్రమంగా అండమాన్ నికోబార్ ద్వీపానికి పశ్చిమ- వాయవ్య దిశగా కదులుతుందని, 4వ తేదీ సాయంత్రానికి చెన్నై-మచిలీపట్నం మధ్య తీరాన్ని దాటుతుందని ఐఎండీ అంచనా వేసింది. ప్రస్తుతం ఈ వాయుగుండం చెన్నైకి ఆగ్నేయ దిశగా బంగాళాఖాతంలో 790 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

Cyclone Michaung is expected to cross between Chennai and Machilipatnam by December 4

దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, తమిళనాడు ఉత్తరప్రాంత జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని, బలమైన ఈదురుగాలులు వీస్తాయని చెన్నైలోని భారత వాతావరణ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎస్ బాలచంద్రన్ తెలిపారు. తిరువళ్లూరు నుంచి మైలాడుదురై వరకు తుఫాన్ ప్రభావం ఉంటుందని అన్నారు.

తిరువళ్లూరు, మైలాడుదురైకి ఆనుకుని ఉన్న రాయవేలూరు, తిరువణ్ణామలై, కాళ్లకురిచ్చి, కొడంగళ్లూర్‌లల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని బాలచంద్రన్ వివరించారు. తిరువళ్లూరు, చెన్నై, కాంచీపురం, రాణిపేట, రాయవేలూరు, చెంగల్‌పట్టుల్లో భారీ వర్షాలు పడతాయని, అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ర ప్రభుత్వానికి సమాచారం అందించినట్లు పేర్కొన్నారు.

తుఫాన్ తీరానికి సమీపించిన సమయంలో 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని బాలచంద్రన్ తెలిపారు. 2వ తేదీ నుంచి తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ మత్స్యకారులెవరూ సముద్రంలో చేపలవేటకు వెళ్లకూడదని ఆదేశించినట్లు ఆయన వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+