వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫైలిన్ తుపాను, 64వేలమందిని తరలించాం: రఘువీరా

|
Google Oneindia TeluguNews

Raghuveera Reddy
హైదరాబాద్: ఫైలిన్ తుపాను కారణంగా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మంత్రి రఘువీరా రెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తుపాను వల్ల లోతట్టు ప్రాంత ప్రజలు ముంపుకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. వాందర్నీ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు.

శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లోని తుపాను ప్రభావతి ప్రాంతాల్లో దాదాపు 64 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. తుపాను కారణంగా వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనక్కి వచ్చేశారని తెలిపారు. రెవెన్యూ శాఖ సహా అన్ని శాఖలను, జిల్లా స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు అధికారులు పునరావాస కేంద్రాల వద్ద బాధ్యతలు చేపట్టారని చెప్పారు.

తుపాను ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు రఘువీరారెడ్డి చెప్పారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో చర్చించి పరిస్థితిని సమీక్షించామన్నారు. ప్రజలు అధికారులు ఇచ్చే సూచనలు పాటించి వారికి సహకరించాలని కోరారు. ఆర్మీ, నేవీ బృందాలు జిల్లాల్లో కేంద్రీకృతమయ్యాయని, తుపాను తీవ్రంగా ఉండే జిల్లాలో పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించామన్నారు.

గత 74 సంవత్సారాల్లో 30 సార్లు తుపాను వచ్చిందని, 1996 వచ్చిన తుపాను తీవ్రతే ఇప్పుడూ ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించినట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అధికారులకు సహకరించాలని కోరారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్‌లో 1077 టోల్ ఫ్రీ నెంబర్‌తోపాటు 08922-236947, ఆర్డీవో కార్యాలయం 0822-276888, పార్వతీపురంలో 08963-221006 నెంబర్లను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

English summary
Andhra Pradesh Revenue Minister Raghuveera Reddy has said that the cyclone is 450 to 500 km away from the Vizag coast and that the Srikakulam-Odisha border will be hit on Saturday evening. Every district has a special officer to oversee operations he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X